క్రైమ్/లీగల్

స్కూల్ ఫీజు కోసం వేధింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, ఆగస్టు 19: విద్యార్థి ఫీజుల విషయంలో ప్రైవేట్ స్కూలు యాజమాన్యం వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ కృష్ణానదిలో దూకడానికి యత్నించింది. అయితే ఆమెను సందర్శకులు కాపాడారు. బాధితురాలిని వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు. మొగల్రాజపురం ప్రాంతానికి చెందిన ఓ మహిళ కుమారుడు అదే ప్రాంతంలోని ప్రముఖ ప్రైవేట్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. మొదటి నుండి అదే స్కూల్ విద్యార్థి. ఈ ఏడాది ఫీజు రూ. 85వేలు చెల్లించాల్సి ఉంది. యూనిఫాం, పుస్తకాల కోసం రూ. 21వేలు చెల్లించారు. మిగతా నగదు డిసెంబర్‌లో, ఆ తరువాత మరో నెలలో చెల్లిస్తామని బతిమాలినా యాజమాన్యం అంగీకరించలేదు. మొత్తం ఇప్పుడే చెల్లించాల్సిందేనని తెగేసి చెప్పింది. ఏమాత్రం వెసులుబాటు కల్పించకుండా నగదు వెంటనే ఇవ్వాలని, లేకుంటే అడ్మిషన్ రద్దుచేస్తామని చెప్పారు. దీనివల్ల తన కుమారుడి భవిష్యత్ దెబ్బతింటుందని మనోవేదనకు గురైన బాధితురాలు సోమవారం సాయంత్రం కృష్ణానదిలో దూకాలని బ్యారేజీ వద్దకు వచ్చింది. నదిలోకి దూకేందుకు సిద్ధమైన ఆమెను గమనించిన సందర్శకులు అడ్డుకొని కాపాడారు. విషయం తెలుసుకొని వెంటనే వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు విద్యార్థిని కూడా పిలిపించి విచారిస్తున్నారు.