క్రైమ్/లీగల్

అపార్ట్‌మెంట్ పైనుండి జారిపడి వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, ఆగస్టు 19: ఓ వ్యక్తి అపార్ట్‌మెంట్ పైనుంచి కాలుజారి పడటంతో మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. జక్కంపూడి కాలనీ కృష్ణా హోటల్ సెంటర్ సమీపంలో నివస్తున్న పీ ప్రభాకర్(40) అపార్ట్‌మెంట్ పైనుండి కాలుజారి కిందపడ్డాడు. అదే సమయంలో ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న కొత్తపేట సీఐ ఉమర్ వెంటనే 108 అంబులెన్స్‌కి ఫోన్ చేశారు. వారు సకాలంలో స్పందించలేదు. నెత్తుటి మడుగులో కొట్టుమిట్టాడుతున్న బాధితుడిని ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందాడని వైద్యులు నిర్థారించారు. తన భర్త అపార్ట్‌మెంట్ పైనుండి కాలుజారి పడటం వల్ల మృతి చెందాడని భార్య చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని ఉమర్ వివరించారు.