క్రైమ్/లీగల్

చిదంబరం అరెస్టు తప్పదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. దీంతో దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలకు అయనను అరెస్టు చేయడానికి మార్గం సుగమమయింది. ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో ప్రాథమిక ఆధారాలను బట్టి చిదంబరం ప్రధాన వ్యక్తి అని, కేవలం పార్లమెంటు సభ్యుడు అయినందున ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడం సమర్థనీయం కాదని హైకోర్టు పేర్కొంది. అంతేకాదు దర్యాప్తు సంస్థ ఈ కేసును సమర్థవంతంగా పరిశోధించడం కోసం చిదంబరంను కస్టడీలోకి తీసుకొని విచారించడం అవసరమని కూడా హైకోర్టు పేర్కొంది. ఇలాంటి ముఖ్యమయిన కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయడం వల్ల సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. గురువారం పదవీవిరమణ చేయనున్న హైకోర్టు న్యాయమూర్తి సునీల్ గౌర్ ఈ తీర్పు ఇచ్చారు. కొన్ని ఇతర హైప్రొఫైల్ కేసుల్లో లాగా సున్నితమయిన ఈ కేసులో ఫలితం రాని రీతిలో ప్రాసిక్యూషన్ దర్యాప్తు చేయడానికి ఈ కోర్టు అనుమతించదని న్యాయమూర్తి అన్నారు. ‘ఈ కేసులో పిటిషనర్ ప్రధానమయిన వ్యక్తి అని అంటే కీలక సూత్రధారి అని ప్రాథమిక ఆధారాలు వెల్లడిస్తున్నాయి. (నిందితుడిని) ప్రశ్నించడంలో న్యాయ పరమయిన ఆటంకాలు సృష్టించడం ద్వారా దర్యాప్తు సంస్థలను అసమర్థమయినవిగా చేయజాలం’ అని న్యాయమూర్తి అన్నారు. నేరం తీవ్రత, అరెస్టు చేయకుండా ఈ కోర్టు రక్షణ కల్పించిన సమయంలో దర్యాప్తు సంస్థలు సంధించిన ప్రశ్నలకు పిటిషనర్ ఇచ్చిన డొంకతిరుగుడు సమాధానాలు అతని ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడానికి కారణాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో 2007లో ఐఎన్‌ఎక్స్ మీడియా గ్రూప్ రూ. 305 కోట్ల విదేశీ నిధులను స్వీకరించడానికి ఫారిన్ ఇనె్వస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎఫ్‌ఐపీబీ) అనుమతించడంలో అక్రమాలు జరిగాయని సీబీఐ 2017 మే 15వ తేదీన ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగినట్టు తరువాత ఈడీ 2018లో కేసు నమోదు చేసింది.