క్రైమ్/లీగల్

అశ్లీల సైట్లను అదుపు చేయలేరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : అశ్లీల చిత్రాలు, సాహిత్యాన్ని అందించే వెబ్‌సైట్లను ఎందుకు కట్టడి చేయడం లేదని హైకోర్టు మంగళవారం నాడు గూగుల్ సెర్చి ఇంజన్‌ను ప్రశ్నించింది. పోర్న్‌వెబ్‌సైట్లకు సంబంధించి పూర్తి వివరాలను అందించాలని ఆదేశాలు జారీ చేసింది. పోర్న్ వెబ్‌సైట్లపై తగిన చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్లపై రాష్ట్ర హైకోర్టు విచారణ చేపట్టింది. అశ్లీల వెబ్‌సైట్ల బరితెగింపుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫేస్‌బుక్‌లో ఉన్న పేర్లు, ఫోటోలు తీసుకుని పోర్న్ సైట్లలో పెడుతున్నారని పేర్కొంటూ ఒక యువతి హైకోర్టును ఆశ్రయించారు. తన పేరు, ఫోటోలను పోర్న్‌వెబ్‌సైట్ల నుండి తొలగించాలని గతంలో గూగుల్ సంస్థకు ఫిర్యాదు చేసినట్టు ఆమె కోర్టు దృష్టికి తెచ్చారు. గూగుల్ సంస్థపై చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని ఆ యువతి పిటిషన్‌లో ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. గూగుల్ సంస్థ పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించినట్టు ఆమె పేర్కొన్నారు. దీనిపై
స్పందించిన హైకోర్టు వ్యాజ్యాన్ని తామెందుకు విచారణకు స్వీకరించరాదో వివరణ ఇవ్వాలని గూగుల్ సంస్థను ఆదేశించింది. తన పేరు , ఇంటిపేరు అశ్లీల వెబ్‌సైట్లలో ఉన్నట్టు గుర్తించిన ఆ యువతి వాటిని తొలగించాలని 2017 ఫిబ్రవరిలో ఆ సంస్థను కోరింది. అపుడు తొలగించినా, తర్వాత మళ్లీ తన పేరు ప్రత్యక్షం అవుతోందని ఆమె తెలిపారు. ఈ అంశంపై ఫిబ్రవరి 27న సైబర్ క్రైమ్ పొలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆమె వివరించారు. దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. అయితే దీనిపై సైబర్ పోలీసులు తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని హైకోర్టుకు నివేదించారు. దీంతో మరోమారు పోలీసులకు ఫిర్యాదు చేయాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది. పోర్న్‌సైట్లను రూపొందిస్తున్న వారిపట్ల గూగుల్ సంస్థ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణను నాలుగు వారాలు వాయిదా వేసింది.