క్రైమ్/లీగల్

ఏసీబీకి చిక్కిన అధికారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, ఆగస్టు 20: లంచం తీసుకుంటూ అవినీతి నిరోదక శాఖ అధికారులకు ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ చిక్కారు. వర్క్ ఇన్‌స్పెక్టర్‌ను కూడా ఏసీబీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బషీరాబాద్ మండలంలో మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులను కాంట్రాక్టర్ గురువయ్య పూర్తిచేశాడు. బిల్లుల కోసం ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ శ్రీనివాస్, వర్క్ ఇన్‌స్పెక్టర్ మహేందర్‌ను పలుసార్లు కలిశాడు. డీఈ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. బిల్లుల విడుదలకు రూ.50వేలను డీఈ డిమాండ్ చేశాడు. 15 రోజుల క్రితం రూ.20వేలను చెల్లించాడు. మిగతా రూ.30వేలు ఇస్తేనే బిల్లులు విడుదల చేస్తానని డీఈ వేదించడంతో ఏసీబీ అధికారులను గురువయ్య సంప్రదించాడు. ఏసీబీ సూచన మేరకు రూ.30వేలను డీఈకి ఇస్తుండగా వలపన్ని పట్టుకున్నారు. లంచం డిమాండ్‌కు సహకరించి వర్క్ ఇన్‌స్పెక్టర్ మహేందర్‌నూ అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.