క్రైమ్/లీగల్

మహిళ అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలానగర్, ఆగస్టు 20: భర్తతో గొడవ పడి ఇంటి నుంచి వెళ్లిపోయి అదృశ్యమైన సంఘటన బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వాహిద్ ఉద్దీన్ కథనం ప్రకారం.. బాలానగర్ పారిశ్రామిక ప్రాంతంలోని శోభనకాలనీకి చెందిన బెల్ సిక్టర్ భవన నిర్మాణ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. 15వ తేదిన భార్య సల్మా సిక్టర్ (27)కు రూ.10 వేలు ఇచ్చారు. రెండు రోజుల అనంతరం అవసరం ఉందని తిరిగి డబ్బులు ఇవ్వాలని అడిగాడు. ఐదు వేల రూపాయలు ఖర్చు అయ్యాయని భార్య చెప్పడంతో ఎందుకు ఖర్చు చేశావని అడగడంతో అతనితో గొడవ పడింది. భర్త బయటకు వెళ్లిపోయాడు. తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చి, తన భార్య కనిపించకపోవడంతో చుట్టు పక్కల వారిని విచారించిన, పరిసర ప్రాంతాల్లో వెతికిన ఆచూకీ లభించకపోవడంతో మంగళవారం బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని ఎస్‌ఐ ఖాదర్ దర్యాప్తు చేస్తున్నారు.