క్రైమ్/లీగల్

అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డికి బెయిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 20: అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లరైన కొల్లం గంగిరెడ్డికి దాదాపు మూడు సంవత్సరాల తరువాత బెయిల్ మంజూరు చేస్తూ తిరుపతి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వివిధ కోర్టుల్లో గంగిరెడ్డిపై 42 కేసులు ఉన్నాయి. ఈ కేసుల్లో కూడా ఆయనకు బెయిల్ మంజూరయింది. గత టీడీపీ ప్రభుత్వం పాలనలో గంగిరెడ్డి మలేషియాకు వెళ్లి తలదాచుకున్నాడు. దీంతో ప్రభుత్వం రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. ఈక్రమంలో 2015లో అప్పటి తిరుపతి ఎస్పీ గోపీనాథ జెట్టి ఆయన్ను ఇండియాకు తెప్పించారు. ఏడాదిపాటు ఆయనపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. పీడీ యాక్ట్ గడువు ముగియడంతో గంగిరెడ్డికి బెయిల్ మంజూరైంది. బెయిల్ మంజూరు కావడంతో త్వరలో ఆయన జైలునుంచి విడుదల కానున్నారు. చిత్తూరు జిల్లా గాజులమండ్యం పోలీస్ స్టేషన్‌లో గంగిరెడ్డిపై 2014లో కేసు నమోదైన విషయం పాఠకులకు విదితమే.