క్రైమ్/లీగల్

డివైడర్‌ను ఢీకొన్న కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్సింగి, ఆగస్టు 20: నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ ఖరీదైన కారు డివైడర్‌ను ఢీకొంది. అయితే ఈ ప్రమాదంపై తొలుత పొంతన లేని కథనాలు వెలువడడంతో గందరగోళం ఏర్పడింది. హీరో తరుణ్ కారుకు ప్రమాదం జరిగిందని తొలుత చానళ్లలో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. తరువాత తరుణ్ వాహనం కాదని, మరో హీరో రాజ్‌తరుణ్ కారు ప్రమాదానికి గురైందని వార్తలు వచ్చాయి. పోలీసుల కథనం ప్రకారం అల్కాపురి కాలనీలో సోమవారం రాత్రి టీఎస్ 09 ఈఎక్స్ 1100 వోల్వో కారు వేగంగా వచ్చి డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం అదే వేగంతో రోడ్డు పక్కన ఉన్న పిట్టగోడను ఢీకొని ఆగిపోయింది. ఈ సంఘటనలో కారు ధ్వంసమైంది. ప్రమాదం తరువాత కారులో ఉన్న యువకుడు కిందకు దిగి సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ రోడ్డు దాటి వెళ్ళిపోయాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. వెంటనే స్ధానికులు వచ్చి చూడగా సినీ నటుడు రాజ్‌తరుణ్ కారులో ఉన్నట్టు గమనించారు. అతడే వాహనం దిగి వెళ్ళిపోయినట్టు వెల్లడించారు. అలాగే సీసీ కెమెరాల్లో కూడా రాజ్‌తరుణ్ పోలీకలున్న వ్యక్తే కనిపించాడు. ప్రమాదంపై నార్సింగి పోలీసులు మాత్రం స్పష్టమైన సమాచారాన్ని అందించలేదు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అలాగే ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్పష్టం చేశారు. కారు నెంబర్ ఆధారంగా స్కే జోన్ యజమానికి సమాచారం అందించామన్నారు. పూర్తి వివరాలు తెలియరాలేదని చెప్పారు. ఇంతకీ కారు నడుపుతున్నదెవరో తెలియని గందరగోళం నెలకొంది. ప్రమాదం తరువాత దిగి వెళ్లిన యువకుడెవరూ స్పష్టత లేదు. మీడియాలో మాత్రం ఫలానా హీరో అంటూ వార్త హల్‌చల్ చేసింది. స్థానికులు మాత్రం కచ్చితంగా రాజ్ తరుణేనని అంటున్నారు.
చిత్రం...సంఘటన స్థలంలో కలకలం సృష్టించిన కారు