క్రైమ్/లీగల్

బ్యాంకులకు బడా టోకరా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఆగస్టు 20: ఆక్వా రాజధానిగా పేరొందిన పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం ప్రాంతంలోని బ్యాంకులకు కొందరు బడాబాబులు రుణాల పేరుతో భారీగా టోకరావేశారు. ప్రస్తుతం టోకరావేసిన మొత్తాలను లెక్కించుకునే పనిలో బ్యాంకులు ఉన్నాయి. ఇది రూ.పది వేల కోట్లకు పైగా ఉండవచ్చని ఒక అంచనా. బ్యాంకులకు పెద్దన్నగా ఉన్న ఒక బ్యాంకుకు భీమవరం రీజియన్ పరిధిలో రూ.5000 కోట్లు మేర టోకరా వేశారని సమాచారం. కాగా భీమవరంలోని సుమారు 27 బ్యాంకు శాఖల నుంచి తీసుకున్న రుణాలు మరో రూ.5000 కోట్లు పైమాటే అని సమాచారం. మొత్తం మీద జిల్లాలోని ఆక్వా రాజధానిగా పేరొందిన భీమవరం పట్టణం, మండలం, నరసాపురం, మొగల్తూరు, కాళ్ల, ఆకివీడు ప్రాంతాల్లో బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలను పరిశీలిస్తే రూ.10వేల కోట్లు పైనే ఉంటుందని సమాచారం. దీనితో బ్యాంకుల ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నట్టు సమాచారం.
రాష్ట్రం నుంచి ఏటా సుమారు రూ.20వేల కోట్లు మేర ఆక్వా ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతవుతాయి. అందులో సింహభాగం భీమవరం ప్రాంతం నుంచే జరుగుతాయి. ఈ నేపథ్యంలో దేశంలోని దాదాపు అన్ని బ్యాంకులు తమ శాఖలను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాయి.
ఇలా ఏర్పాటైన వివిధ బ్యాంకు శాఖల నుండి ఆక్వా రైతులు, ఆక్వా ఫీడ్ వ్యాపారులు, ఆక్వా ఎగుమతిదారులు, రియల్ ఎస్టేట్, బిల్డర్లు భారీగా రుణాలు పొందారు. ఆక్వాకు సంబంధించినంత వరకు పలువురు పశ్చిమ గోదావరి-కృష్ణా జిల్లా సరిహద్దుల్లోని చేపల చెరువులు, కొల్లేరు ప్రాంతంలోని చెరువుల పేరిట వివిధ సర్వే నెంబర్లతో ఉన్న భూముల పత్రాలను బ్యాంకులకు ఇచ్చినట్టు సమాచారం. ఇందులో పలు పత్రాలు ఫోర్జరీవి కాగా, మరికొన్ని పొందిన రుణం కంటే తక్కువ విలువైనవని సమాచారం. ఆయా ప్రాంతాలకు చెందిన పలువురు రైతుల పేరిట కూడా బినామీ రుణాలు పొందినట్టు సమాచారం.
కాగా భీమవరంలోని ఒక బ్యాంకు ఇటీవలే మొండి బకాయిగా మారిన ఒక రుణం వసూలుకు తమకు తనఖాపెట్టిన ఆస్తిని వేలం వేయడానికి ప్రయత్నించినపుడు ఇచ్చిన రుణం కంటే సగానికి కంటే తక్కువ విలువ ఉంటుందని తేలినట్టు సమాచారం. దీనితో బ్యాంకు వాల్యూయర్‌ను పక్కనపెట్టినట్టు సమాచారం. అలాగే ఆస్తుల పత్రాలను పరిశీలించి, రుణం మంజూరుకు క్లియరెన్స్ ఇచ్చే పలువురు లీగల్ అడ్వయిజర్ల పాత్రపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా ఒక్కొక్కటిగా వ్యవహారాలు వెలుగులోకి వస్తుండటంతో బ్యాంకుల స్థానిక అధికారులు ఉన్నతాధికార్ల దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. దీనితో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) రంగంలోకి దిగింది. ఇదిలావుండగా బ్యాంకుల కోట్లాది రూపాయలను రుణాలుగా పొందిన వారిలో ఎక్కువ మంది రాజకీయ నేపథ్యం ఉన్నవారేనని చెప్పవచ్చు. రుణాలు పొందిన వారు చెల్లింపులు చెయ్యకపోవడంతో బ్యాంకులు పంపిస్తున్న అధికారులు రిజిస్టర్ పోస్టులో నోటీసులు పంపిస్తుంటే అవి తిరిగివచ్చేస్తున్నట్టు సమాచారం. దీంతోచేసేదిలేక బ్యాంకు బృందాలు రుణాలు తీసుకున్నవారి ఆస్తుల వివరాలు సేకరించి, వాటిని స్వయంగా గుర్తించి జీపిఎస్ విధానంలోకి తెచ్చుకుంటున్నారు. కాగా రెండు రోజుల క్రితం రుణగ్రహీతగా ఉన్న ఒక వ్యక్తి ఆస్తిని స్వాధీనం చేసుకోవడానికి రక్షణ కావాలని భీమవరం టూటౌన్ పోలీసులకు ఒక బ్యాంకు ఫిర్యాదు చేయడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.