క్రైమ్/లీగల్

లింగన్నను పట్టుకొని కాల్చేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 21: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం రోళ్లగడ్డ అటవీ ప్రాంతంలో సీపీఐఎంఎల్ న్యూ డెముక్రసీ నాయకుడు పున్నం లింగయ్య అలియాస్ లింగన్నది ఎన్‌కౌంటర్ కాదని, పోలీసులు పట్టుకుని కాల్చి చంపేశారని పిటిషనర్ బుధవారం నాడు హైకోర్టులో తమ వాదనలు వినిపించారు. ఇందుకు సాక్షులు కూడా ఉన్నారని, వారి పేర్లను న్యాయమూర్తులకు చెప్పారు. లింగయ్య ఎన్‌కౌంటర్ జూలై 31న జరిగింది. అయితే అది ఎన్ కౌంటర్ కాదని, ముందుగా పోలీసులు అదుపులోకి తీసుకుని చంపేశారని దీనిపై సిట్ దర్యాప్తు నిర్వహించాలని కోరుతూ స్టేట్ సివిల్ లిబర్టీస్ కమిటీ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన హైకోర్టు లింగన్న మృతదేహానికి ముగ్గురు వైద్యుల కమిటీ ద్వారా రీ పోస్టుమార్టంకు ఆదేశాలు జారీ చేసింది. తొలుత కొత్తగూడెం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించగా, రెండోమారు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో రీ పోస్టుమార్టం నిర్వహించి ముగ్గురు వైద్యుల బోర్డు తమ నివేదికను హైకోర్టుకు సమర్పించింది. లింగన్న ఎన్‌కౌంటర్‌పై అన్ని వర్గాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. 11 గంటలకు జరిగిన ఎదురుకాల్పుల్లో లింగన్న ఎన్‌కౌంటర్ అయినట్టు పోలీసులు చెబుతుండగా, ఉదయం ఏడు గంటల ప్రాంతంలోనే లింగన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వారి బంధువులు పేర్కొంటున్నారు. ఇంకా లింగన్న దళానికి చెందిన నలుగురు కార్యకర్తలు పోలీసులు అదుపులోనే ఉన్నారని వారి బంధువులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై బుధవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. పోస్టుమార్టం రిపోర్టుపై పిటిషనర్ తరఫున న్యాయవాది యు. రంగనాధ్ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. లింగన్నను బూటకపు ఎన్‌కౌంటర్‌లో చంపారని ఆయన వాదించారు. లింగన్నను పట్టుకుని కాల్చి చంపుతుండగా నలుగురు సాక్షులు ఉన్నారని పేర్కొంటూ వారి పేర్లను న్యాయస్థానానికి తెలిపారు. నలుగురు సాక్షులకు భద్రత కల్పించాలని పిటిషనర్ కోర్టును కోరారు. వాదనలు విన్న హైకోర్టు నలుగురు సాక్షులకు భద్రత కల్పించాలని హోం శాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది. సాక్షుల నుండి ఈ నెల 28న 164 స్టేట్‌మెంట్లను ఇల్లెందు కోర్టులో రికార్డు చేయాలని హైకోర్టు పేర్కొంది. స్టేట్‌మెంట్లను రికార్డు చేసిన తర్వాత ఆ వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది.