క్రైమ్/లీగల్

‘మహా’ మాజీ సీఎం జోషి కుమారుడ్ని విచారించిన ఈడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 21: ఓ కంపెనీకి పెద్ద మొత్తంలో ముట్టజెప్పిన రుణాలు, ఈక్విటీ వాటాల్లో జరిగిన అక్రమాలకు సంబంధించి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి కుమారుడు ఉనే్మష్‌ను ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వరుసగా మూడో రోజు బుధవారం కూడా విచారణ కొనసాగించింది. కోషినూర్‌లో సీటీఎన్‌ఎల్ ఇన్‌ఫ్రాస్ట్రక్ష్చర్ కంపెనీని ఉనే్మష్, ఎంఎన్‌ఎస్ చీఫ్ రాజ్‌థాక్రే స్థాపించారు. అయితే వాడుకలోలేని కోహినూర్ మిల్లును థాక్రే అనుచరుడు, బిల్డర్ రాజన్ శిరోద్కర్ ఖరీదు చేసి అభివృద్ధి చేపట్టారు. దీంతో థాక్రే కంపెనీ నుంచి నిష్క్రమించారు. అయితే ఇక్కడ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ ఈ నెల 22న తమ ముందు హాజరుకావాల్సిందిగా థాక్రేను ఆదేశించింది. అందుకు థాక్రే స్పందిస్తూ తాను ఈడీ పంపించిన సమన్లను గౌరవిస్తాననని చెప్పారు. ఉనే్మష్ కూడా తాను ఈ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నానని తెలిపారు. అయితే ఇది 12 ఏళ్ళ క్రితం జరిగిన ఒప్పందం అని, అవసరమైన అన్ని రికార్డులు, పత్రాలు తీసుకుని వచ్చి అధికారంలోకి చూపేందుకు సమయం పడుతుందన్నారు. ఇందులో హవాలా అక్రమాలు ఏమీ లేవని, 2008 తర్వాత థాక్రేతో ఎటువంటి వ్యాపారాలు చేయలేదని ఆయన వివరించారు.