క్రైమ్/లీగల్

ఘర్షణ కేసులో ఏడుగురి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్సింగి, ఆగస్టు 21: మద్యం మత్తులో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. గండిపేటలోని గండిమైసమ్మ దేవాలయంలో మంచిరేవుల, కొల్లూరు ప్రాంతాలకు చెందిన యువకులు దావత్ చేసుకున్నారు. మద్యం మత్తులో ఇరువర్గాలకు చెందిన యువకులు దాడులు చేసుకోవడంతో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మంచిరేవుల ప్రాంతానికి చెందిన వీ.శ్రీకాంత్(27), పీ.రవీందర్(26), డీ.నాగార్జున(27), వీ.ప్రవీణ్(21), బీ.శ్రీకాంత్(26), బీ.సురేష్(23), రాము(19)గా గుర్తించి కేసు నమోదు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు.
తొమ్మిది మంది పేకట రాయుల రిమాండ్
బాలాపూర్, ఆగస్టు 21: గుట్టచప్పుడు కాకుండ పేకట ఆడుతున్న తొమ్మిది మందిని పోలీసులు రిమాండ్‌కు తరలించిన సంఘటన బుధవారం మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మీర్‌పేట్ ఆదర్శహిల్స్, నంది హిల్స్ దగ్గర బుధవారం ఆర్ధరాత్రి పేకట ఆడుతున్న సమాచారం మేరకు ఎస్‌ఐ మైబెల్లి, మొబైల్ హధిరమ్, కానిస్టేబుల్ శ్రీనివాస్ వెళ్లి చూడగా తొమ్మిది మంది పేకట ఆడుతున్నారు. పేకట ఆడుతున్నవారిని అదుపులోకి తీసుకొవడంతో పాటు వారి నుంచి రూ.17 వేలు, తొమ్మిది సెల్ పోన్లు సీజ్‌చేసి, వారిని కోర్టుకు తరలించారు.