క్రైమ్/లీగల్

మరణంలోనూ వీడని బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిఠాపురం, ఏప్రిల్ 13: మృత్యువులోనూ వారి బంధం వీడలేదు. ప్రభుత్వ ఉద్యోగులైన వీరిద్దరూ ముగ్గురు పిల్లలతో ఆనందంగా గడుపుతున్నారు. పిల్లలకు వేసవి సెలవులు కావడంతో సొంత ఊరు చూసొద్దామని బయలుదేరిన వీరిని మృత్యువు మార్గం మధ్యంలోనే రైలు రూపంలో కబళించింది. పిఠాపురం రైల్వే స్టేషనులో గురువారం అర్థరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో రైలు ఢీకొని భార్యాభర్తలు మృతిచెందారు. రైల్వే ఆసుపత్రిలో వైద్య సిబ్బందిగా సేవలందించే వారిద్దరూ రైలు ప్రమాదంలో ఒకేసారి మృతి చెందడం విషాదం.
పిఠాపురం మండలం విరవాడకు చెందిన గుర్జు సూర్యనారాయణ (46), వెంకటలక్ష్మి(42) దంపతులు త్రిపురలోని రైల్వే ఆసుపత్రిలో వైద్య సిబ్బందిగా పనిచేస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం. మొదటి కుమార్తె థెరిస్సాకు పిఠాపురం పట్టణం ఇందిరానగర్‌కు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. మరో ఇద్దరు పిల్లలు నాని, చంద్రకళతో ఉద్యోగరీత్యా త్రిపురలో నివసిస్తున్నారు. వేసవి సెలవలు కావడంతో పెద్ద కుమార్తెను చూడటంతోపాటు, స్వగ్రామం విరవాడలో కొద్ది రోజులు ఆనందంగా గడపడానికి రెండో కుమార్తె చంద్రకళతో కలిసి గురువారం విశాఖపట్నం చేరుకున్నారు. అక్కడ నుంచి విశాఖ -మచిలీపట్నం ప్యాసింజర్ రైలు ఎక్కారు. అర్థరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో పిఠాపురం స్టేషన్‌లో రెండో నెంబరు ప్లాట్‌ఫాంపై దిగారు. వెంట తెచ్చుకున్న కొంత లగేజీని ఫ్లాట్‌ఫాంపై ఉంచి, కుమార్తె చంద్రకళను కాపలావుంచి, మిగిలిన లగేజీతో భార్య భర్తలిద్దరూ మొదటి ప్లాట్‌ఫాంకు వెళ్లడానికి పట్టాలు దాటుతున్నారు. ఇంతలో వేగంగా విశాఖ వైపువెళుతున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ వారిరువురినీ ఢీకొంది. దీనితో క్షణాల్లో వారు మృత్యువాతపడటం, మృతదేహాలు చెల్లాచెదురుగా పడటం జరిగిపోయింది. అయితే తల్లిదండ్రులు వస్తారని రెండో నెంబరు ప్లాట్‌ఫాంపై లగేజీతో కూర్చునివున్న వారి కుమార్తె చంద్రకళకు ప్రమాదం జరిగిన గంట వరకూ ఈవిషయం తెలీదు. అయితే తల్లిదండ్రులు ఎంతసేపటికీ రాకపోవడంతో చంద్రకళ మొదటి ప్లాట్‌ఫాంకు రావడంతో ప్రమాద విషయంతెలిసింది. దీనితో ఒక్కసారిగా షాక్ గురైంది. భోరున విలపిస్తూ వెంటనే బంధువులకు ఫోన్ చేసి సమాచారమివ్వడంతో బంధువులు అక్కడకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సాయంత్రం విరవాడ గ్రామంలో వారి మృతదేహాలను ఖననం చేశారు.