క్రైమ్/లీగల్

డబ్బులు వసూలు చేస్తున్న ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడ్‌మెట్, ఆగస్టు 21: విజిలెన్స్ అధికారులమంటూ చెప్పి ఆయిల్ ట్యాంకర్ యజమానుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్న ఆరుగురు ముఠా సభ్యులను భువనగిరి ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం నేరేడ్‌మెట్ రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలను అడిషనల్ కమిషనర్ సుధీర్ బాబు వెల్లడించారు. ఆనంతపూర్ గుంతకల్‌కు చెందిన షేక్ ఫజల్ రహమాన్(42) ట్యాంకర్ డ్రైవర్. తులసీ(33), హరీష్(30), భరత్(24), శ్రీను(30), వినోద్(24)తో కలసి ముఠాగా ఏర్పడి సులభంగా డబ్బులు సంపాదించాలని పథకం వేశాడు. బ్లాక్ ఆయిల్ తక్కువ ధరకు విక్రయిస్తామంటూ చెప్పి ఆయిల్ ట్యాంకర్ యజమానులకు ఫోన్ చేస్తారు. తాము చెప్పిన చిరునామకు డబ్బులు తీసుకురావాలని చెప్పి డబ్బులు తీసుకువస్తున్న యజమానులను మార్గం మధ్యలో అడ్డగించి విజిలెన్స్ అధికారులమని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలిపారు. ఆరుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.8 లక్షల నగదు, ఇండికా కారు, సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు.