క్రైమ్/లీగల్

ఆలయాన్ని కూల్చే మసీదు కట్టారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 22: రామాలయాన్ని కూల్చివేసే అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో బాబ్రీ మసీదు కట్టారని, అనాదిగా హిందువులు ఈ ప్రాంతంలో పూజలు చేస్తూనే వస్తున్నారని ఓ హిందూ సంస్థ గురువారం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. ఈ ప్రాంతంలో పూజలు చేసే హక్కు తమకు కల్పించాలని కోర్టును కోరింది. 1950లో ప్రార్థనా హక్కుల కోసం దిగువ కోర్టులో కేసు వేసిన రామ భక్తుడు గోపాల్ సింగ్ విశారద్ 1986లో మరణించాడు. ఇప్పుడు ఆయన తరఫున ఈ కేసును కుమారుడు రాజేందర్ సింగ్ చేపట్టారు. అయోధ్య కేసుపై రోజువారీ విచారణ చేస్తున్న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పదో రోజు గురువారం ఈ అంశంపై విచారణ కొనసాగించింది. రామాలయాన్ని కూల్చివేసే మసీదును కట్టారని అయినప్పటికీ కూడా పట్టు వదలకుండా అక్కడ పూజలు చేస్తూనే వస్తున్నారని, అయితే, ముస్లింలకు ఈ స్థలంపై ఎప్పుడూ ఎలాంటి హక్కు లేదని సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించారు.
ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ సారథ్యంలోని ఈ ధర్మాసనంలో న్యాయమూర్తులు ఎస్‌ఏ బాబ్డే, డీవై చంద్రచూడ్, అశోక్ భూషణ్, ఎస్‌ఏ నజీర్‌లు సభ్యులుగా ఉన్నారు. రామాలయ ప్రాంతంపై గతంలో తమ వాదనలు వినిపించిన పరాశరన్, వైద్యనాథన్‌లను ఉటంకిస్తూ ‘మొత్తం ఈ ప్రాంతమే దైవమయం.. నేను భక్తుడిని కాబట్టే నాకు పూజించే హక్కు ఉంది.. దానిని ఎట్టి పరిస్థితుల్లో నీరుగార్చడానికి వీల్లేదు’ అని న్యాయవాది తెలిపారు.