క్రైమ్/లీగల్

నిషేధిత గుట్కాలు, ఖైనీల పదార్థాల వ్యాపారులపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేదరమెట్ల, ఆగస్టు 23: నిషేధిత పొగాకు ఉత్పత్తులైన గుట్కా, ఖైనీల ప్యాకెట్లు, వాటిని తయారుచేసే యంత్ర పరికరాల రాకెట్‌ను పోలీసుల చేధించిన సంఘటన ప్రకాశం జిల్లా మేదరమెట్ల గ్రామంలో శుక్రవారం ఉదయం జరిగింది. ఈసందర్భంగా మేదరమెట్ల గ్రామానికి విచ్చేసిన జిల్లా ఎస్‌పీ సిద్దార్ధకౌశల్ గుట్కాలు, ఖైనీలు తయారుచేసే యంత్రాన్ని, గోదామును పరిశీలించారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనకు అందిన సమాచారం మేరకు దర్శి డిఎస్‌పీ ప్రకాశరావు, ఎస్‌బి డీఎస్‌పి విఎస్ రాంబాబు, అద్దంకి సీఐ అశోక్‌వర్ధన్, మేదరమెట్ల ఎస్‌ఐ బాలకృష్ణ, ఎస్‌బీ కానిస్టేబుల్ జిలానీ మేదరమెట్లలోని గోదాముపై దాడిచేసి ఈ నిషేధిత ఉత్పత్తులు తయారుచేసి రామెటిరియల్‌ను, యంత్రపరికరాలను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన బలగాని ప్రసాద్ అనే వ్యక్తి మేదరమెట్ల గ్రామానికి చెందిన పోకూరి హనుమంతరావు ఉరఫ్ బుల్లిబ్బాయి అనే వ్యక్తికి చెందిన నిఖిత పొగాకు గోదాములో నిషేధిత పొగాకు ఉత్పత్తులైన ఖైనీ, గుట్కాలు, ఢిల్లీకి చెందిన హ్యాన్స్ అనే కంపెనీ పేరుమీద అక్రమంగా మత్తు పదార్ధాలు తయారుచేసి ప్యాకింగ్ తయారుచేస్తున్నారని తెలిపారు. ఈ గోదాములో 265గన్నీ బ్యాగుల్లో టుబాకో పౌడర్‌ను, ఇంకా మత్తు పదార్ధాలు తయారుచేసే 10నుండి 12 రకాలకు చెందిన రసాయనాలను కూడా పెద్దపెద్ద ప్లాస్టిక్ పీపాల్లోను, 20నుండి 40లీటర్ల క్యాన్లల్లోను నిల్వఉంచారన్నారు. ఈ మెటీరియల్‌తో సుమారు 14నుండి 14లక్షల గుట్కా ప్యాకెట్లను తయారుచేయవచ్చునని తెలిపారు. స్వాధీనం చేసుకున్న మెటీరియల్, యంత్రపరికరాల విలువ సుమారు మూడుకోట్ల రూపాయల వరకు ఉంటుందన్నారు. సాధారంగా మన రాష్ట్రంలో ఈ పొగాకు ఉత్పత్తులపై నిషేధం ఉండటం వలన అప్పుడప్పుడు పొరుగు రాష్ట్రాలనుండి మన రాష్ట్రానికి తరలిస్తుండగాను, గ్రామాలు, పట్టణాల్లోని బంకుల్లో విక్రయిస్తుండగా పట్టుబడుతుంటాయన్నారు. అలాంటిది మన జిల్లాలోని ఈ గ్రామంలో ఇంతపెద్దన బరితెగించి అక్రమ ఆస్తులు, పొగాకు ఉత్పత్తులు తయారుచేస్తూ పట్టబడటం ఇదే ప్రధమనన్నారు. ఈ కేసును ఇంకా లోతుగా పరిశీలించి దోషులు ఎంతటివారైనా పట్టుకుని వారికి శిక్షలు పడేలా చూస్తామన్నారు. ఇలాంటి మత్తుపదార్ధాలను అరికట్టేందుకు రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే ఆదిశగా కఠిననిర్ణయాలు తీసుకుంటుందన్నారు. ఆ స్ఫూర్తితో తమ శాఖకూడా ఇలాంటి వ్యాపారులపై దృష్టిపెట్టి నిర్వాహకులపై కఠినంగా వ్యవహరిస్తూ ఉక్కుపాదం మోపుతామన్నారు. గతమూడు సంవత్సరాలనుండి ఈవ్యాపారాన్ని గుట్టు రట్టుచేసిన తమశాఖ సిబ్బందిని తాను అభినందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఈ మత్తురాకెట్ వివరాలను ముందుగా కనుగొన్న ఎస్‌బి హెడ్‌కానిస్టేబుల్ జిలానీని ప్రత్యేకంగా ఎస్‌పీ సిద్దార్ధకౌశల్ అభినందిస్తూ ఆయనకు ఐదువేల రూపాయల నగదు రివార్డును అందించారు. కాగా నిందితుడు పరారులో ఉండగా గోదాము యజమానిని, దాంట్లోని యంత్రపరికరాలను అదుపులోకి తీసుకున్నారు. ఈ విలేఖర్ల సమావేశంలో దర్శి డీఎస్‌పీ ప్రకాశరావు, ఎస్‌బి డీఎస్‌పీ విఎస్ రాంబాబు, అద్దంకి సీఐ అశోక్‌వర్ధన్, ఎస్‌బీ సీఐ శ్రీకాంత్‌బాబు, మేదరమెట్ల ఎస్‌ఐ బాలకృష్ణ, ఎస్‌బీ కానిస్టేబుల్ జిలానీ, సిబ్బంది పాల్గొన్నారు.