క్రైమ్/లీగల్

పడవలో మంటలు 22 మంది గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా, ఆగస్టు 23: పడవలో మంటలు చెలరేగడంతో పెను ప్రమాదం సంభవించింది. ఇందులో ప్రయాణిస్తున్న 277 మందిలో 22 మంది ప్రయాణికుల జాడ కనిపించడం లేదు. ఇండోనేషియాలో రెండవ అతి పెద్ద నగరమైన సురబాయ నుంచి బాలిక్‌పాపన్‌కు (బొర్నియో ద్వీపం) 277 మంది ప్రయాణికులతో పడవ బయలుదేరింది. అయితే మార్గమధ్యలో మంటలు చెలరేగడంతో గందరగోళం చెలరేగి ప్రయాణికులు అటు-ఇటు పరుగులు తీశారు. నల్లటి పొగ అలుముకోవడంతో మరింత ఆందోళన కలిగించింది. పడవ ప్రమాదంలో చిక్కుకుందన్న సమాచారం తెలుసుకున్న సహాయ, భద్రతా బలగాలు హుటాహుటిన అక్కడికి చేరుకునిన 255 మందిని కాపాడగలిగారు. అయితే మిగతా 22 మంది జాడ తెలియడం లేదని సురబయలోని తన్‌జుంగ్ పెర్క్ పోర్టు అధికార ప్రతినిధి సియాచురుల్ న్యూగ్రోహో ఎఎఫ్‌పి ప్రతినిధికి తెలిపారు. అయితే ఆచూకి లేని వారు పడవలోనే ఉన్నారా? అనేది తెలియడం లేదన్నారు. పడవ ప్రమాదానికి కూడా కారణాలు తెలియడం లేదన్నారు. మంటలు చెలరేగడం, విద్యుత్తు నిలిచి పోవడం, నల్లటి పొగ అలుముకోవడం జరిగిందన్నారు. ప్రయాణికుల గందరగోళంతో సిబ్బంది కూడా వెంటనే మంటలు ఆర్పేందుకు నీటి పంపులను, అగ్నిమాపక ఫైర్‌ఎక్సిట్నిగ్వషర్లను ఉపయోగించలేకపోయారని ఆయన తెలిపారు.