క్రైమ్/లీగల్

షిమ్లా లోయలో పడిన ఆర్మీ ట్రక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షిమ్లా, ఆగస్టు 23: హిమాచల్ ప్రదేశ్, షిమ్లా జిల్లాలో ఓ మిలటరీ ట్రక్కు ప్రమాదవశాత్తున ఎతె్తైన పర్వత ప్రాంతం నుంచి లోయలో పడడంతో ఓ జవాను మృతి చెందగా, మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. భారత ఆర్మీ మహర్ రెజిమెంట్‌కు చెందిన సైనికులు ట్రక్కులో హర్యానాలోని అంబాల నుంచి షిమ్లాకు బయలుదేరారు. కాగా వారు ప్రయాణిస్తున్న ట్రక్కు ప్రమాదవశాత్తున హిమాచల్ ప్రదేశ్‌లోని గాలు, లాంమీధార్‌కు మధ్య వంద అడుగుల ఎత్తు నుంచి లోయలో పడిందని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఓంపతి జామ్‌వాల్ తెలిపారు. ఈ ప్రమాదంలో ఓ జవాన్ మరణించగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని ఆయన చెప్పారు. గాయపడిన వారిని ఇక్కడి ఇందిరా గాంధీ వైద్య కళాశాల-ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మరణించిన జవాన్ రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ జిల్లా, గులబ్బరి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించామన్నారు. గాయపడిన జవాన్లు సూర్జన్ తుట్టి (ఆంధ్ర ప్రదేశ్), బీకే రాయ్ (బీహార్-పాట్నా), నాగప్ప బీ. మసాబీ (కర్నాటక-బెల్గాం జిల్లా)కు చెందిన వారని ఆయన తెలిపారు.