క్రైమ్/లీగల్

పవన్ కల్యాణ్‌పై దుష్ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 23: సామాజిక మాధ్యమాల వేదికగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై జరుగుతున్న దుష్ప్రచారంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. సామాజిక మాధ్యమాల వేదికగా జనసేనపై జరుగుతున్న దుష్ప్రచారానికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తమ ఫిర్యాదులో కోరారు. పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రూ.2 వేల కోట్ల బ్లాక్ మనీని వైట్‌మనీగా ఆయన మార్చారంటూ సోషమ్ మీడియాలో వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆ ఫిర్యాదులో ఆరోపించారు. వైసీపీ సోషల్ మీడియా విభాగంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీ ఆఫీషియల్ సోషల్ మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండిస్తున్నామని జనసేన పార్టీ తెలంగాణ ఇన్‌చార్జి శంకర్ గౌడ్ తెలిపారు. పవన్ కల్యాణ్‌పై వైసీపీ ఆఫీషియల్ సోషల్ మీడియా పేజీ వేదికగా ప్రచారం చేస్తున్న అసత్య ప్రచారంపై శుక్రవారం హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు జనసేన పార్టీ ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామిచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడి వ్యక్తిగత కార్యదర్శి పి.హరి ప్రసాద్ మాట్లాడుతూ కొందరు ఉద్దేశపూర్వకంగా పవన్ కల్యాణ్, జనసేన పార్టీ మీద అభాండాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇక మీదట జనసేన పార్టీ మీద ఇలాంటి దుష్ప్రచారాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడానికి పార్టీ సిద్ధంగా ఉందని చెప్పారు. జనసేన సీనియర్ నేత షేక్ రియాజ్, లీగల్ సెల్ కో ఆర్డినేటర్ ప్రతాప్ ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు.