క్రైమ్/లీగల్

638 పెట్రోలు బంకుల్లో తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 23: పెట్రోలు బంకుల్లోజరుగుతున్న అక్రమాలు, అవకతవకలపై పౌరసరఫరాల శాఖ స్పందించింది. పెట్రోలు, డీజిల్‌ను నిర్దేశిత కొలతల మేరకు కాకుండా తక్కువగా పోస్తున్నారని, కల్తీ చేస్తూ అమ్ముతూ బంకు యాజమాన్యాలు అక్రమాలకు పాల్పడుతున్నాయని ఫిర్యాదులు అందుతున్నట్లు ఆ శాఖ పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా 2553 పెట్రోలు బంకులకు గాను ఈ నెల 1వ తేదీ నుంచి 21వ తేదీ వరకు 638 బంకుల్లో తనిఖీలు నిర్వహించారు. ఇందులో 183 బంకుల యాజమాన్యాలకు క్రమశిక్షణ చర్యల కింద నోటీసులు జారీ చేశారు. ఇందులో రంగారెడ్డిలో 24, కరీంనగర్‌లో 20, కామారెడ్డిలో 20, సిద్ధిపేటలో 14 బంకులకు ఈ నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. జిల్లా పౌరసరఫరాల శాఖ, తూనికల కొలతల శాఖ, ఆయిల్ కంపెనీల ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు.