క్రైమ్/లీగల్

పైశాచికానందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, ఆగస్టు 23: యువతుల నగ్న వీడియోలతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పైశాచికానందం పొందాడు. రిసెప్షనిస్టు ఉద్యోగం పేరుతో దేశంలోని 16 రాష్ట్రాలకు చెందిన 600 మంది మహిళల నగ్న వీడియోలు రికార్డు చేసుకున్నాడు. రాడిసన్ హోటల్‌లో హెచ్‌ఆర్ మేనేజర్‌గా పరిచయం చేసుకుని వాట్సాప్‌లో నగ్న ఫొటోలు, వీడియోలు సేకరించి వాటి ద్వారా ఆనందం పొందేవాడు. ఓ మహిళ ఫిర్యాదుతో అతని బండారం బయటపడి కటకటాల పాలయ్యాడు. మియాపూర్ పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని తిరువొత్తియూర్, బ్యాంక్ కాలనీకి చెందిన క్లెమెంట్ రాజ్ చెజియాన్ అలియాస్ ప్రదీప్ (33) చెన్నైలోని టీసీఎస్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. క్లెమెంట్ రాజ్ మనసు చెడు ఆలోచనల వైపు మళ్లింది. ఇతర మహిళలను నగ్నంగా చూడాలనే దురాలోచనతో తక్విక్ డాట్‌కామ్ పేరుతో ఓ వెబ్‌సైట్‌ను రూపొందించాడు. రాడిసన్ హోటల్‌లో ఫ్రంట్ ఆఫీస్‌లో రిసెప్షనిస్టు ఉద్యోగ నియామకాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించాడు. హెచ్‌ఆర్ మేనేజర్ అర్చనా జగదీష్ ఇంటర్వ్యూ చేస్తారని దరఖాస్తు చేసుకున్న యువతులకు వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపాడు. వ్యాధులు ఉంటే ఉద్యోగం పోతుందని, నగ్న చిత్రాలు పంపించాలని నమ్మబలికి మహిళా హెచ్‌ఆర్ మేనేజర్ అవతారంలో చాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. 600 మంది మహిళలు తమ నగ్న ఫొటోలను పంపించారు. వాటన్నింటినీ చూస్తూ తన పైశాచికానందాన్ని పొందుతున్న నిందితుడు.. అంతటితో ఆగక వారి నగ్నత్వాన్ని స్వయంగా చూడాలనే దుర్బుద్ధి కలిగింది. రెండో విడత ఇంటర్వూలో భాగంగా మహిళా హెచ్‌ఆర్ మేనేజర్‌కు వాట్సాప్ వీడియో కాలింగ్ ద్వారా నగ్నంగా తమ శరీరాన్నంతా చూపించాలనే నిబంధన పెట్టాడు. మహిళా మేనేజరే కదా అనుకుని నిందితుడు చెప్పినట్టుగానే చేయగానే 600 మంది నగ్న వీడియోలను తన మొబైల్‌లో రికార్డు చేసుకున్నాడు. డబ్బులు ఇవ్వాలంటూ బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. పోలీసులను మియాపూర్‌కు చెందిన ఓ బాధితురాలు ఆశ్రయించడంతో అతడి మోసం బట్టబయలైంది. అతన్ని అరెస్టు చేసిన మొబైల్‌ను స్వాధీనం చేసుకుని అందులో ఉన్న ఫొటోలు, వీడియోలు, చాటింగ్‌లు తిరిగి రాబట్టడానికి ఫొరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్)కి పంపించారు. శుక్రవారం రిమాండుకు తరలించారు. మియాపూర్ ఇన్‌స్పెక్టర్ వెంకటేష్, ఎస్‌ఐ రఘురామ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.