క్రైమ్/లీగల్

37 మంది విద్యార్థులకు అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిట్లం, ఆగస్టు 23: మధ్యాహ్న భోజనం వికటించి 37 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని చిన్నకొడప్‌గల్ జడ్పీహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాలలో, శుక్రవారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటుచేసుకుంది. వారిని వెంటనే ఉపాధ్యాయులు పిట్లం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రతి రోజు మాదిరిగానే మధ్యాహ్న భోజనాన్ని తిన్న విద్యార్థులు నాలుగు గంటల ప్రాంతంలో సుమారు 20 మందికి తల తిరగడం, కడుపునొప్పి, వాంతులు కావడంతో, గమనించిన ఉపాధ్యాయులు ఆందోళన చెంది వారిని వెంటనే పిట్లం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తర్వాత సైతం ఒక్కరొక్కరుగా అస్వస్థతకు గురికావడంతో అస్వస్థతకు గురైన విద్యార్థుల సంఖ్య మొత్తం 37కు చేరుకుంది. వీరంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొందరి పరిస్థితి విషమంగా మారడంతో, వారికి సెలైన్ బాటిళ్లు ఎక్కించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎలాంటి ప్రాణాపాయ స్థితి లేదని, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రాధాకిషన్ తెలిపారు. అందరికీ మెరుగైన వైద్య చికిత్సలను అందిస్తున్నామని తెలిపారు. విషయం తెలుసుకున్న జడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, చిన్నకొడప్‌గల్ ఎంపీటీసీ వెంకట్‌రెడ్డితోపాటు టీఆర్‌ఎస్ నాయకులు విజయ్, నారాయణ్‌రెడ్డి ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, విద్యార్థులకు ధైర్యం చెప్పి, మెరుగైన వైద్యసేవలు అందించాలని, వైద్యున్ని కోరారు. విషయం తెలుసుకున్న పిట్లం తహశీల్దార్ సుధాకర్ ఆసుపత్రికి చేరుకుని, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వైద్యున్ని అడిగి తెలుసుకుని, ప్రమాదం లేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఒకేసారి 37 మంది విద్యార్థులు ఆసుపత్రికి చికిత్సల నిమిత్తం చేరుకోవడంతో ఆసుపత్రి ఆవరణ అంతా విద్యార్థుల తల్లితండ్రులు ప్రజాప్రతినిధులతో సందడిగా మారింది. మధ్యాహ్న భోజన ఏజన్సీవారు నాణ్యమైన భోజనం అందించడం లేదని, గతంలో కూడా ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థుల తల్లితండ్రులు ఆరోపించారు. ఈ పాఠశాలకు ధర్మారం, అల్లాపూర్, బుర్నాపూర్ గ్రామాల నుంచి, విద్యార్థులు చదువుకోవడానికి వస్తుంటారన్నారు. మధ్యాహ్న బోజనం సరిగా లేనందున చాలామంది విద్యార్థులు ఇంటి నుంచి టిఫిన్ బాక్స్‌లు తీసుకు వస్తున్నారని తల్లితండ్రులు తెలిపారు. పాఠశాల మధ్యాహ్న భోజన ఏజన్సీ నిర్వాహకుల్ని మార్చాలని ఈసందర్భంగా తహశీల్దార్ సుధాకర్‌ను కోరారు. ఆసుపత్రి వద్ద పరిస్థితి సమీక్షించేందుకు బాన్స్‌వాడ సీఐ టాటాబాబు, ఎస్‌ఐ సుధాకర్ చేరుకుని పరిస్థితి సమీక్షించారు. పరిస్థితి పూర్తిగా అదుపులోఉండటంతో తల్లితండ్రులు శాంతించారు.