క్రైమ్/లీగల్

హైకోర్టును తరలించొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 23: అసెంబ్లీ తరహాలో హైకోర్టును బుద్వేల్ గానీ మరో ఇతర ప్రదేశానికి తరలించాలనే ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు హైకోర్టు పరిరక్షణ కమిటీ నేతలు శుక్రవారం నాడు పేర్కొన్నారు. తరలింపు ప్రతిపాదన చేస్తే న్యాయవాదుల నుండి తీవ్రంగా ప్రతిఘటనను ఎదుర్కోవల్సి వస్తుందని వారు హెచ్చరించారు. దీనికి హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన పరిపాలనా కమిటీ ఏ మాత్రం సానుకూలంగా వ్యవహరించరాదని కోరారు. ప్రస్తుత హైకోర్టు భవనాల పరిధిలో కొన్ని ఎకరాల విస్తీర్ణం ఖాళీ ప్రదేశం ఉందని అవసరమైతే కొత్త భవనాలను నిర్మించుకునే అవకాశం ఉందని, కానీ ట్రాఫిక్ సమస్యపేరుతో తరలించే ఆలోచనను తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో అడ్డుకుంటామని హెచ్చరించారు. హైకోర్టు బిల్డింగ్‌ను ఫలక్‌నుమా ప్యాలెస్ తరహాలో ఫైవ్‌స్టార్ హోటల్ గ్రూప్‌లకు ఇచ్చే కుట్రలను అడ్డుకుంటామని అన్నారు. హైకోర్టును కాపాడుకోవల్సి ఉందని, రాజకీయ పార్టీలకు అతీతంగా న్యాయవాదులు అంతా ఐక్యంగా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఈ ప్రతిపాదనలను అడ్డుకుంటామని పరిరక్షణ కమిటీ నేతలు కేవీ రామారావు, సుంకరి జనార్ధన్ , ఆర్ వెంకటేష్ తదితరులు పేర్కొన్నారు.