క్రైమ్/లీగల్

అగ్రిగోల్డ్ కేసును బదిలీ చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 23: అగ్రిగోల్డ్ కేసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గత ఐదేళ్లుగా కొనసాగుతున్న ఈ కేసును ఏపీకి బదిలీ చేయాలన్న పిటిషన్‌ను సోమవారం నాడు తెలంగాణ హైకోర్టు విచారణకు చేపట్టే అవకాశం ఉందని తెలిసింది. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు నాంపల్లి సీబీఐ కోర్టు శుక్రవారం నాడు నోటీసులు జారీ చేసింది. వోక్స్‌వాగన్ కేసులో సాక్షిగా తన వివరణ ఇవ్వాలని సీబీఐ కోర్టు ఈ నోటీసుల్లో పేర్కొంది. వచ్చే నెల 12న సీబీఐ కోర్టుకు హాజరుకావాలని సూచించింది. ఇప్పటికే కొంత మంది సాక్షులను విచారించిన సీబీఐ కోర్టు వచ్చే నెల బొత్స వివరణను కూడా నమోదు చేయనుంది.