క్రైమ్/లీగల్

దైవానికి వ్యతిరేకంగా భక్తుడు వెళ్లరాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 23: భక్తుడు లేదా దేవుడిని కొలిచే సంస్థ చేసే వాదన ఎప్పుడు కూడా దైవానికి వ్యతిరేకంగా ఉండకూడదని సుప్రీంకోర్టు శుక్రవారం ‘నిర్మోహి అఖారా’కు తెలిపింది. ‘రామ్ లల్లా’ వేసిన వ్యాజ్యాన్ని తిరస్కరించాలని, అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని తనకు అప్పగించాలని, ఎందుకంటే దేవుడి ఏకైక ఆరాధ సంస్థను తానేనని నిర్మోహి అఖారా వాదించిన తరువాత సుప్రీంకోర్టు పైవిధంగా వ్యాఖ్యానించింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలంపై వాదనలను 11వ రోజు వింటూ, నిర్మోహి అఖారా.. ‘రామ్ లల్లా వీరజ్‌మాన్’ వ్యాజ్యాన్ని వ్యతిరేకిస్తున్నదంటే, అది దైవం వ్యాజ్యానికి వ్యతిరేకంగా వెళ్తున్నట్టే, దైవం వ్యాజ్యాన్ని కొట్టివేయాలని కోర్టును కోరుతున్నట్టే అని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. అయితే, సుప్రీంకోర్టు వ్యాఖ్యలను అఖారా తరపు న్యాయవాది సుశీల్ జైన్ వ్యతిరేకించారు. ఆరాధ సంస్థ హోదాలో నిర్మోహి అఖారా చేతుల్లోనే సదరు ఆస్తి ఉంటూ వస్తోందని, అందువల్ల ఆ ఆస్తిపై దాని హక్కును తోసిపుచ్చజాలమని ఆయన వాదించారు.