క్రైమ్/లీగల్

చిదంబరానికి తాత్కాలిక ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 23: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరాన్ని మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయకుండా సుప్రీంకోర్టు తాత్కాలిక రక్షణ కల్పిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో సీబీఐ, ఈడీ కేసులను ఆగస్టు 26న విచారించడానికి అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. అయితే, ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతి వ్యవహారానికి సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులో చిదంబరం కస్టోడియల్ ఇంటరాగేషన్ విషయంలో సుప్రీంకోర్టు శుక్రవారం జోక్యం చేసుకోలేదు. అందువల్ల చిదంబరం సోమవారం వరకు సీబీఐ కస్టడీలోనే ఉంటారు. న్యాయమూర్తులు ఆర్.్భనుమతి, ఏఎస్ బొపన్నలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ రెండు అంశాలను ఆగస్టు 26న (సోమవారం) విచారించాలని నిర్ణయించింది. ‘పిటిషనర్ తరపు న్యాయవాదులు, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు విన్న తరువాత ఈడీ కేసులో సహ నిందితుడికి (ముందస్తు) బెయిల్ ఇచ్చినట్టు భావించాలి. ఈ కేసు తదుపరి విచారణ వరకు పిటిషనర్‌ను అరెస్టు చేయకూడదు. సోమవారం (ఆగస్టు 26) పిటిషన్‌ను విచారించడం జరుగుతుంది’ అని ధర్మాసనం పేర్కొంది. ధర్మాసనం ఈ ఆదేశాలు వెలువరించిన తరువాత, మెహతా కొన్ని డాక్యుమెంట్లతో కూడిన ఒక సీల్డ్ కవర్‌ను కోర్టుకు అందజేయడానికి ప్రయత్నించారు. అరెస్టు నుంచి చిదంబరంకు రక్షణ కల్పించడానికి ఆదేశాలు జారీ చేయడానికి ముందు ధర్మాసనం తన అంతరాత్మను సంతృప్తి పరచుకోవాలని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అయితే, ఈ డాక్యుమెంట్లను స్వీకరించడానికి ధర్మాసనం తిరస్కరించింది. వాటిని సోమవారం సమర్పించాలని సూచించింది. ఇవి రహస్య పత్రాలని, ఇలా ఉంచకూడదని పేర్కొంది. అంతకు ముందు విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ న్యాయవాది, సొలిసిటర్ జనరల్ మెహతాలతో కాంగ్రెస్ పార్టీకి చెందిన చిదంబరం తరపు న్యాయవాదులు కపిల్ సిబాల్, ఏఎం సింఘ్వీలకు వాడివేడిగా వాదోపవాదాలు జరిగాయి. ఈడీ నమోదు చేసిన మనీలాండరింగ్ కేసులో అరెస్టు కాకుండా చిదంబరంకు రక్షణ కల్పించే ఆదేశాలను మెహతా గట్టిగా వ్యతిరేకించారు. చిదంబరంకు తాత్కాలిక ఉపశమనం కలిగించడానికి తీవ్రమయిన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, ఆయన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఆస్తులు కొనుగోలు చేసినట్టు ఈడీ అనేక ఆధారాలు సేకరించిందని మెహతా తెలిపారు. షెల్ కంపెనీల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు బదిలీ అయిందని, ఈ లావాదేవీల గుట్టు విప్పడానికి చిదంబరంను కస్టడీలోకి తీసుకొని విచారించవలసిన అవసరం ఉందని ఆయన వాదించారు.