క్రైమ్/లీగల్

పోలీస్ పేరుతో చైన్ స్నాచింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, ఆగస్టు 23: నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగిని పరామర్శించేందుకు వచ్చిన ఓ వ్యక్తిని పోలీస్ అని బెదిరించి చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డ సంఘటన పంజాగుట్టు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్‌లో నివాసం ఉండే రవిచంద్ర సింగ్ ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. తన బంధువు ఒకరు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా గురువారం రాత్రి పరామర్శించేందుకు వచ్చాడు. సుమారు 11 గంటల ప్రాంతంలో నిమ్స్ మిలినియం బ్లాక్ నుంచి నిమ్స్ ప్రధాన గేట్ వద్దకు వచ్చి వేచి ఉన్నాడు. ఇంతలో ఓ గుర్తుతెలియని వ్యక్తి అతని వద్దకు వచ్చి చెంపపై దాడి చేసి, తాను పోలీస్‌నంటూ హడలెత్తించాడు. అతను తేరుకునేలోపే మేడలోని చైన్‌ను లాక్కొని వెళ్లిపోయాడు. బాధితుడు డయల్ 100కు ఫోన్ చేశాడు. సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. గురువారమే తాను రూ. 30వేలు పెట్టి గొలుసును కొనుగోలు చేశానని రిసిప్ట్‌ను సైతం పోలీసులకు చూపించాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు