క్రైమ్/లీగల్

స్నాచింగ్ కేసులో నకిలీ పోలీసుల గుట్టు రట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, ఆగస్టు 24: పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రి ప్రధాన గేట్ వద్ద చోటు చేసుకున్న స్నాచింగ్ కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. శనివారం పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను ఏసీపీ తిరుపతన్న, సీఐ కరుణాకర్ రెడ్డి, డీఐ నాగయ్య వెల్లడించారు. చిత్తూరు జిల్లా కుప్పానికి చెందిన రవిచంద్ర నిమ్స్ ప్రధాన గేట్ వద్ద ఉండగా ఓ వ్యక్తి అతనిపై దాడి చేసి గొలుసును చోరీ చేసినట్టు బాధితుడు ఫిర్యాదు చేశాడని తెలిపారు. కేసు నమోదు చేసుకున్ననిమ్స్ ఆసుపత్రి వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా కొద్ది పాటి ఆనవాళ్లను కనిపించాయని చెప్పారు. వాటి ఆధారంగా దర్యాప్తు చేపట్టగా ఎంఎస్ మక్తాకు చెందిన ఫరీద్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడిందని అన్నారు. స్నాచింగ్ కేసుతో సంబంధం ఉన్న అబ్దుల్ రహ్మాన్, షేక్ ఇమ్రాన్, షేక్ శాబాజ్, మహ్మద్ సోహెల్‌ను సైతం అరెస్టు చేసినట్టు చెప్పారు. పోలీసుల పేరుతో దాడి చేసి చోరీలు చేస్తున్న ఈ నకిలీ పోలీసుల వద్ద నుంచి స్నాచింగ్‌కు గురైన 5.3 తులాల గొలుసు, ద్విచక్ర వాహనం, సెల్‌ఫోను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.