క్రైమ్/లీగల్

చిదంబరం సవాల్ పిటిషన్లపై నేడు సుప్రీం విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 25: ఐఎన్‌ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ హైకోర్టు తనకు ముందస్తు బెయి ల్ నిరాకరించడంపై మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం దాఖలు చేసిన సవాల్ పిటిషన్‌ను సోమవారం విచారణ చేపట్టనుంది. అలాగే, తనపై జారీ అయిన అరెస్టు వారెంట్‌ను కూడా సవాల్ చేస్తూ చిదంబరం తాజాగా దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా జస్టిస్ ఆర్. భానుమతి సారథ్యంలోని సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఐఎన్‌ఎక్స్ కేసులో సోమవారం వరకు తనను ట్రయల్ కోర్టు సీబీఐ రిమాండ్‌కు పంపడాన్ని కూడా చిదంబరం సవాల్ చేశారు. చిదంబరానికి సోమవారం వరకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం ఉత్తర్వు జారీ చేసింది. ఈ అంశంపై చిదంబరం దాఖలు చేసిన పిటిషన్‌కు తగిన జవాబు ఇవ్వాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను ఆదేశించిన సుప్రీంకోర్టు మొత్తం మూడు కేసులను సోమవారం విచారిస్తామని తెలిపింది. హైకోర్టు ఉత్తర్వును సుప్రీంకోర్టు విచారణ చేపట్టకపోవడం ప్రాథమిక హక్కులకు విరుద్ధమని చిదంబరం తన అభ్యర్థనలో ఆరోపించారు.