క్రైమ్/లీగల్

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో యువకుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, ఆగస్టు 25: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఓ యువకుడు మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్, దీప్తిశ్రీనగర్‌లో నివాసముండే పీ.వెంకటేశ్వర రావు కుమారుడు పీ.సాయి శివకాంత్ (35) వ్యాపారి. ఎన్‌ఎస్‌యూఐ నాయకునిగా కొనసాగుతున్నాడు. శనివారం అర్థరాత్రి సుమారు ఒంటిగంట సమయంలో సాయిశివకాంత్ తన టీఆర్ నెంబరైన టాటా స్ట్రోమ్ కారును నడుపుకుంటూ బాచుపల్లి నుండి మియాపూర్ వైపు వెళ్తున్నాడు. బాచుపల్లి కోకాకోలా క్రాస్ రోడ్ సమీపంలో లహరి కన్‌స్ట్రక్షన్స్ ఎదురుగా ప్రమాదకరంగా, నిర్లక్ష్యంగా లారీని పార్క్ చేశారు. పార్క్ చేసిన కారును సాయి శివకాంత్ ఢీకొట్టాడు. తీవ్ర గాయాలకు గురైన సాయిశివకాంత్ అక్కడికక్కడే మృతిచెందాడు. వెలమల జగన్నాథ రావు(24) ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంటాడు. శనివారం అర్థరాత్రి అరబిందో ఫార్మా కంపెనీలో విధులను ముగించుకుని తన స్నేహితుడైన సురేశ్(25)తో కలిసి ద్విచక్ర వాహనంపై బాచుపల్లి నుంచి బొల్లారం వెళ్తున్నాడు. మార్గ మధ్యలో మల్లంపేట్ రోడ్డులో వెనుక నుంచి కారు అతివేగంగా వచ్చి జగన్నాథరావు వాహనాన్ని ఢీకొట్టాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నివాళి
శేరిలింగంపల్లి : యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయి శివకాంత్ రావు రోడ్డు ప్రమాదంలో దుర్మరణ చెందాడు. శనివారం రాత్రి బాచుపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు ధ్వంసమై ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం మియాపూర్‌లోని దీప్తిశ్రీనగర్‌లో గల గృహంలో పార్థివ దేహాన్ని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేట్టి కుసుమకుమార్, గాలి అనిల్, మానవతా రాయ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్, కౌశల్ సమీర్ సందర్శించి నివాళి అర్పించారు.