క్రైమ్/లీగల్

యూపీలో ఘోరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతాప్‌ఘర్/సంభాల్, ఆగస్టు 25: ఉత్తర్ ప్రదేశ్‌లో ఈతకు వెళ్ళిన ఏడుగురు చిన్నారులు మృత్యువాతపడ్డారు. ఆదివారం రెండు వేర్వేరు చెరువుల్లో ఏడుగురు మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రతాప్‌ఘర్ జిల్లాలోని కోదౌర్ ప్రాంతంలోని ఓ చెరువులో ఈత కొట్టేందుకు సూర్యగ్రహ గ్రామానికి చెందిన నలుగురు యుక్త వయస్సుగల వారు వెళ్ళారు. చెరువులోకి దిగిన అనూప్ (14), రుచి (15), శివానీ (13), ఆర్తి (13) లోతుగా ఉన్న వైపు వెళ్ళడంతో వారికి ఈత రాకపోవడం వల్ల మృతి చెందారు. అయితే ఇది గమనించిన స్థానికులు వారిని రక్షించి హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్ళినా, అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారని జిల్లా అదనపు ఎస్‌పి సురేంద్ర ప్రసాద్ తెలిపారు. సంభాల్ జిల్లాలోని మాయి హుస్సేన్‌పూర్ పుక్తా గ్రామానికి చెందిన ముగ్గురు బాలికలు జ్ఞానశ్రీ (12), కుసుమ (10), కుమ్‌కుమ్ (14) సమీపంలోని ఓ చెరువులోకి దిగారు. బాలికలు లోతు ఎక్కువగా ఉన్న వైపు వెళ్ళి మృత్యువాతపడ్డారు. వారి మృత దేహాలను వెలికి తీయించి పోస్టు మార్టం పరీక్షలకు పంపించినట్లు గున్నౌరు సబ్-డివిజనల్ మెజిస్ట్రేట్ ఓంవీర్ సింగ్ తెలిపారు.