క్రైమ్/లీగల్

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంషాబాద్, ఆగస్టు 25: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా బంగారం ఆదివారం పట్టుబడింది. ఇంటెలిజెన్స్ అధికారుల ముందస్తు సమాచారంతో షార్జా నుంచి ఇండిగో 6ఈ 1406 నంబర్ విమానంలో హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద నుంచి 26 బంగారు కడ్డీలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మూడు కిలోల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. పట్టుబడిన బంగారం విలువ రూ.1.11 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించిన్నట్లు వెల్లడించారు.
చిత్రం...ఎయిర్‌పోర్టులో స్వాధీనం చేసుకున్న మూడు కిలోల బంగారు బిస్కెట్లు