క్రైమ్/లీగల్

అనాథకు ఇన్సూరెన్స్.. సొమ్ము కోసం హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఆగస్టు 25: కరుడుగట్టిన ఫ్యాక్షన్ ప్రాంతంగా పేరుగడించిన కర్నూలు జిల్లాలో క్రైమ్ థ్రిల్లర్‌ను మరిపించే హత్య జరిగింది. సుమారు నాలుగేళ్ల క్రితం ఓ అనాథను చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి అతడి సోదరుడి పేరుతో రూ. 33 లక్షల ఇన్సూరెన్స్ సొమ్ము స్వాహా చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ సంఘటనకు సంబంధించి ఆదివారం కర్నూలు నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఫకీరప్ప విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అవుకు మండల పరిధిలోని మెట్టుపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ భాస్కర్‌రెడ్డి ఇంటిలో గత 20 ఏళ్లుగా సుబ్బరాయుడు వ్యవసాయం, పశువుల కాపరిగా పని చేస్తూ జీవనం సాగించేవాడు. సుబ్బరాయుడు అనాథ. అతడికి ఎవరూ లేరు. ఇదే అదనుగా భావించిన భాస్కర్‌రెడ్డి త్వరగా సులువుగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశ్యంతో అవుకు పట్టణానికి చెందిన షేక్‌షావలి, హోటల్ రమణ, మహేశ్వరరెడ్డితో కలిసి పథకం ప్రకారం అనాథ అయిన సుబ్బారాయుడు పేరు మీద శ్రీరామ్‌లైఫ్ ఇన్సూరెన్స్‌లో 2 పాలసీలు (ఒకటి రూ. లక్ష, మరొకటి రూ. 15లక్షలు) చేయించి ఆ సొమ్ము కాజేయాలని భావించారు. ఈక్రమంలో భాస్కర్‌రెడ్డి తన మిత్రులైన చంద్రశేఖర్‌రెడ్డి, షేక్‌షావలి, శివశంకర్, వెంకటకృష్ణతో కలిసి సుబ్బరాయుడు హత్యకు కుట్ర పన్ని పథకం రూపొందించారు. పథకం ప్రకారం 2015 డిసెంబర్ 5వ తేదీ తెల్లవారుజామున సుబ్బారాయుడును అవుకు గ్రామం సమీపంలోని మెట్టుపల్లి రోడ్డులో ఉన్న జమ్మిచెట్టు వద్ద గొంతు నులిమి హత్య చేశారు. ఆ తర్వాత రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు సుబ్బరాయుడు తలపై ట్రాక్టర్ ఎక్కించారు. అనంతరం శవాన్ని బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అవుకు పోలీస్‌స్టేషన్‌లో ట్రాక్టర్ ప్రమాదంగా ఫిర్యాదు చేశారు. ఈ పథకంలో భాగంగా భాస్కర్‌రెడ్డి తన పేరును వడ్డే భాస్కర్, తండ్రి పేరు వడ్డే సంజన్నగా ఓటరు గుర్తింపుకార్డును సైతం సృష్టించాడు. ఇన్సూరెన్స్ పాలసీల్లో సైతం సుబ్బరాయుడు నామినీగా ఉన్నానని అతడు మా తమ్ముడేనని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులను నమ్మబలికారు. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో వడ్డే భాస్కర్ పేరుతో ఖాతా తెరిచారు. అలాగే న్యాయవాది సూచనల మేరకు ఇన్సూరెన్స్ అధికారుల సహాయ సహకారాలతో వడ్డే సుబ్బరాయుడు మీద ఉన్న ఇన్సూరెన్స్ పాలసీలపై వచ్చిన దాదాపు రూ. 33 లక్షలు తీసుకుని భాస్కర్‌రెడ్డి, షేక్‌షావలి, హోటల్ రమణ, న్యాయవాది, ఇన్సూరెన్స్ అధికారులు పంచుకున్నట్లు విచారణలో తేలిందన్నారు.
కర్నూలు సీసీఎస్ డీఎస్పీ వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం అవుకు మెట్ట వద్ద సుబ్బరాయుడు హత్య కేసు నిందితులైన భాస్కర్‌రెడ్డి, అవుకు పట్టణానికి చెందిన షేక్‌షావలి, మెట్టుపల్లి గ్రామానికి చెందిన వెంకటక్రిష్ణ, శివశంకర్‌లను అరెస్టు చేసినట్లు తెలిపారు. అలాగే ఇన్సూరెన్స్ సొమ్ము కాజేసేందుకు సహకరించిన మరో ఐదుగురు మెట్టుపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డి, అవుకు పట్టణానికి చెందిన రమణ, నంద్యాలకు చెందిన న్యాయవాది మహేశ్వర్‌రెడ్డి, హైదరాబాద్‌లోని శ్రీరామ్‌లైఫ్ ఇన్సూరెన్స్‌కు చెందిన మల్లేష్, శర్మ కోసం ప్రత్యేక బృందంతో గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. హత్య కేసును ఛేదించిన సీసీఎస్ డీఎస్పీ వినోద్‌కుమార్, సీఐ నిరంజన్‌రెడ్డి, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో జిల్లా అనదపు ఎస్పీ దీపకాపాటిల్, సీసీఎస్ డీఎస్పీ వినోద్‌కుమార్, ఎస్‌బీ డిఎస్పీ రమణమూర్తి పాల్గొన్నారు.
చిత్రం...కర్నూలులో సుబ్బరాయుడు హత్య కేసు వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ ఫకీరప్ప