క్రైమ్/లీగల్

పెయిడ్ ఆర్టిస్ట్ శేఖర్ చౌదరి అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 25: వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ప్రజలను నమ్మించేందుకు రైతువేషం వేయటంతో పాటు జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పెయిడ్ ఆర్టిస్ట్ శేఖర్ చౌదరిని విజయవాడ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. శేఖర్ చౌదరిది గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం. జగన్ ప్రభుత్వంపై బురద జల్లే పెయిడ్ పబ్లిసిటీలో ఇతను కీలకంగా ఉన్నాడు. ఎన్నికల సమయంలో టీడీపీ ప్రకటనల్లో కూడా నటించాడు. ఇటీవల వరద సమయంలో రైతు వేషం కట్టి తానొక రైతునని ప్రజలను నమ్మించడం ద్వారా రైతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందన్న భావన కల్గించడం కోసం అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నటించాడు. దీనిపై అనేక పోలీసు స్టేషన్‌లలో యాదవ సంఘీయులు ఫిర్యాదులు చేశారు. విజయవాడలో తిరుగుతున్న శేఖర్ చౌదరిని సత్యనారాయణపురం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. కుట్రలో భాగంగానే రైతు వేషం కట్టి ప్రభుత్వాన్ని తిట్టినట్లు అంగీకరించాడని, తనతో పాటు ప్రభుత్వంపై బురద జల్లేందుకు టీడీపీ మరికొందరిని ఉపయోగిస్తున్నట్లు అతను వెల్లడించినట్లు పోలీసులు చెబుతున్నారు.

చిత్రం...పోలీసుల అదుపులో శేఖర్ చౌదరి