క్రైమ్/లీగల్

ప్రేమ పేరుతో వంచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, ఆగస్టు 26: ఫేస్‌బుక్ ప్రేమాయణాలను నమ్మి మోసపోవద్దని పోలీసులు ఎన్ని రకాలుగా చెబుతున్న యువతలు మాత్రం పట్టించుకోవడం లేదు. ముఖ పుస్తక పరిచయాలను ప్రేమగా ఊహించుకుని యువతులు మోసపోతున్నారు. సైబర్ నేరగాళ్లు విసిరే వలలో పడి చెప్పే మాయమాటలకు మోసపోయి లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు.
వ్యాపారవేత్తనని బాడీగార్డులతో కలిసి దిగిన ఫొటోలతో ఓ యువతిని నమ్మించి సూమారు రూ.13లక్షలు టోకరా వేసిన నిందితుడిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ క్రైం ఏసీపీ శ్రీనివాస్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం చెన్నైకి చెందిన మహ్మద్ సల్మాన్ నాజీర్ సర్కార్(32) ముంబయిలో నివాసముంటున్నాడు. చిన్నాచితక వ్యాపారం చేసుకునే నాజీర్ జల్సాలకు అలవాటు పడి సులువగా డబ్బులు సంపాదించాలని బాడా వ్యాపారవేత్తగా అవతారమెత్తాడు. పక్కన బాడీ గార్డులను పెట్టుకుని ఖరీదైన హోటల్స్ దిగిన ఫొటోలతో యువతులను మోసం చేయసాగాడు. జనవరి 2018లో నవాజ్ నగరానికి చెందిన యువతికి ఫ్రెండ్ రిక్వస్ట్ పంపించాడు. యువతి స్పందించి ఫ్రెండ్‌గా అంగీకరించింది. ఫేస్‌బుక్ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో పాటు గంటల తరబడి ఇద్దరు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. తనకు అత్యవసరంగా డబ్బు అవసరం ఉందని తన స్నేహితుడి బ్యాంక్ ఖాతాకు పంపమని చెప్పాడంతో పంపించింది. తరువాత అనారోగ్యంతో ఉన్ననాని ఆసుపత్రికి డబ్బు చెల్లించాలని నమ్మించాడు. పలు దఫాలుగా 12లక్షల 96వేల రూపాయలు పంపించినప్పటికీ తరచూ డబ్బులు కావాలని వేధించాడు. నగరానికి వచ్చిన సమయంలో ఇద్దరు కలసి దిగిన ఫొటోలను మార్పింగ్ చేసి ఫేస్‌బుక్‌లో పెడతానని బెదిరించడంతో 11న సైబర్ క్రైం పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. నిందితుడు సల్మాన్ నవాజ్ సర్కార్‌ని అరెస్టు చేశారు. విచారణలో జల్సాలకు అలవాటు పడిన నగరానికి చెందిన యువతిలో పాటు పలువురిని ఇదే తరహాలో మోసం చేసినట్లు అంగీకరిచాడని ఏసీపీ తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసిన విచారణ అధికారి గంగాధర్ టీమ్‌ని అభినందించారు.