క్రైమ్/లీగల్

సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో అవినీతి రాజ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఆగస్టు 26: విజయవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖాధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పెద్ద ఎత్తున అవినీతి రాజ్యమేలుతున్నట్లు తనిఖీల్లో అధికారులు గుర్తించారు. లంచాలే పరమావధిగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నట్లు ఏసీబీ తనిఖీల్లో వెల్లడైంది. ప్రైవేటు వ్యక్తులు, ఏజెంట్ల ద్వారా అధికారులు పెద్దఎత్తున లంచాలు దండుకుంటున్నట్లు గుర్తించారు. దీనికితోడు అనధికార డాక్యుమెంటు రైటర్లను సైతం కార్యాలయాల్లో అనుమతించి అక్రమ మార్గంలో సొమ్ము చేసుకుంటున్నట్లు ప్రాథమిక విచారణలో వెలుగుచూసింది. ఏసీబీ డీజీకి అందిన సమాచారం మేరకు ఉన్నతాధికారుల ఆదేశాలతో ఏసీబీ అదనపు ఎస్పీ సాయికృష్ణ నేతృత్వంలో విజయవాడ రేంజ్ ఏసీబీ డీఎస్పీ టి కనకరాజు ఆధ్వర్యాన తనిఖీలు చేపట్టారు. పటమటలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిపిన తనిఖీల్లో అవినీతి వెలుగు చూసింది. ఇక్కడి ఎస్‌ఆర్‌ఓ 12మంది డాక్యుమెంట్ రైటర్లను కార్యాలయంలోకి అనుమతించి అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. వీరి నుంచి రూ.3,41,000 అనధికార నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఆర్‌ఓ ముగ్గురు ప్రైవేటు, అనధికార వ్యక్తులను తన కార్యాలయం నుంచి అవినీతి కార్యకలాపాలకు వినియోగించుకుంటున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. తనిఖీలకు సంబంధించి నివేదికను ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి పంపనున్నట్లు డీఎస్పీ కనకరాజు తెలిపారు. ఈసందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తనిఖీల్లో భాగంగా పలువురు డాక్యుమెంటు రైటర్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విచారించామని, కార్యాలయ ఆవరణలో ప్రైవేటు వ్యక్తులు ఉండరాదని అన్నారు. ప్రజలు మధ్యవర్తులకు లంచాలు ఇవ్వరాదని సూచించారు. తమకు వచ్చిన సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించామని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు తెలియచేసేందుకు నిరాకరించారు. ఈ దాడుల్లో ఇన్‌స్పెక్టర్లు కె వెంకటేశ్వర్లు, ఎస్ వెంకటేశ్వరరావు, జి కెనడీ, హ్యాపీ కృపానందం, శ్రీ్ధర్, తదితరులు పాల్గొన్నారు.