క్రైమ్/లీగల్

గాలి బెయిల్ డీల్‌పై విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 26: ఓబుళాపురం గనుల కేసులో నిందితుడు గాలి జనార్ధన్‌రెడ్డి బెయిల్ డీల్ కేసులో ఏసీబీ కోర్టుకు మాజీ సీబీఐ న్యాయమూర్తి నాగమారుతీ శర్మ , గాలిజనార్ధనరెడ్డి సోమవారం హాజరయ్యారు. బెయిల్ డీల్ కేసులో న్యాయాధికారి నాగమారుతీ శర్మ నాలుగో సాక్షిగా ఉన్నారు. ఇరువరి వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను సెప్టెంబర్ 12కు వాయిదా వేశారు. మైనింగ్ కేసులో గాలి జనార్ధన్‌రెడ్డి అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న సమయంలో ఆయనకు బెయిల్ ఇప్పించాలని ఆయన బంధువు దశరధరామిరెడ్డి రంగంలోకి దిగి స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగా ఉన్న టీ లక్ష్మీనరసింహరావు ద్వారా ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ సమయంలో సీబీఐ జడ్జిగా నాగమారుతీశర్మ వ్యవహరిస్తున్నారు. ఆడిటర్ కృష్ణప్రసాద్, ఎం వెంకటేశ్వరరావుల ద్వారా నాగమారుతీశర్మను సంప్రదించగా ఆయన తిరస్కరించారు. రియల్ ఎస్టేట్ డీలర్ రవిసూర్యప్రకాశ్ బాబు, కర్నాటక ఎమ్మెల్యే శ్రీరాములు, ఆయన బంధువైన మరో ఎమ్మెల్యే టీహెచ్ సురేష్‌బాబు, కొల్లి లక్ష్మయ్య చౌదరిలు మరో ప్రయత్నం చేసి ఎన్నికల కమిషన్ లీగల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న డీ ప్రభాకరరావు ద్వారా అప్పటి స్పెషల్ జడ్జి టీ పట్ట్భారామారావును ఆయన కుమారుడు రవిచంద్ర ద్వారా సంప్రదించారు. అయితే తర్వాత గాలి జనార్ధనరెడ్డికి బెయిల్ లభించడం, ఏసీబీ అధికారులు బెయిల్‌లో భూమిక పోషించిన న్యాయాధికారులను, న్యాయమూర్తి టీ పట్ట్భారామారావును, ఆయన కుమారుడు రవిచంద్రతో పాటు పలువురు న్యాయాధికారులను అరెస్టు చేశారు. అయితే ఆనాడు బెయిల్ విషయంలో డబ్బు ఆసరా చూపారా అన్న అంశంపై జరుగుతున్న విచారణకు సంబంధించి నాగమారుతీశర్మ కోర్టుకు హాజరుకాగా ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు.