క్రైమ్/లీగల్

ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచార యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఆగస్టు 26: అభంశుభం తెలియని ఎనిమిదేళ్ల చిన్నారిపై మద్యం మత్తులో ఓ కామాంధుడు లైంగిక దాడికి తెగబడ్డాడు. జిల్లా కేంద్రంలోని దొడ్డికొమురయ్యనగర్‌లో నివాసం ఉండే చిన్నారిని, అదే కాలనీకి చెందిన ప్రకాష్ (37) అనే వ్యక్తి తాగిన మైకంలో మాయమాటలు చెప్పి తన వెంట నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. అతని ప్రయత్నం ఫలించకపోవడంతో కోపోద్రిక్తుడై బాలిక జననాంగాన్ని గాయపర్చాడు. తీవ్ర రక్తస్రావమైన బాలిక జిల్లా జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాలిక ద్వారా విషయం తెలుసుకున్న స్థానికులు ప్రకాష్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి జరుగగా, ఐద్వా సంఘం చేపట్టిన నిరసన కార్యక్రమంతో సోమవారం వెలుగు చూసింది.