క్రైమ్/లీగల్

కోడెల కుమార్తెపై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 26: శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మిపై గుంటూరు జిల్లా నర్సరావుపేట రెండవ పట్టణ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. కోడెల కుమార్తె విజయలక్ష్మి గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం గోళ్లపాడు గ్రామంలో సేఫ్ ఫార్మాస్యూటికల్స్ పేరిట ఓ సంస్థను ఏర్పాటుచేసి అక్కడ సెలైన్ బాటిల్స్‌తో పాటు వివిధ ఔషధాలు తయారు చేస్తుంటారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన రవీంద్రారెడ్డి వెంకటేశ్వర సర్జికల్ కాటన్ మ్యాన్‌ఫ్యాక్చర్స్ సంస్థను ఏర్పాటుచేసి కాటన్ బండిల్స్‌ను సరఫరా చేస్తుంటారు. కోడెల కుమార్తె విజయలక్ష్మి సంస్థకు కూడా సరుకును సరఫరా చేసేవారు. గడిచిన 11 నెలలుగా సుమారు 14 లక్షల రూపాయలకు పైగా రవీంద్రారెడ్డికి విజయలక్ష్మి బాకీపడ్డారు. మూడు నెలల క్రితం నర్సరావుపేటలోని కోడెల నివాసంలో విజయలక్ష్మిని రవీంద్రారెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ పోతురాజు, వాసుదేవరావు, శ్రీనివాసరావులతో కలిసి డబ్బులు చెల్లించాలని కోరగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంచేసిన ఆమె తన అనుచరులతో దాడి చేయించారని బాధితులు తెలిపారు. దీంతో సోమవారం వారు పోలీసులను ఆశ్రయించగా పోలీసులు కేసు నమోదు చేశారు.