క్రైమ్/లీగల్

కాలువలో పడి ఇద్దరు బాలురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గరివిడి, ఆగస్టు 26: ఆటపాటలతో,ఆనందంగా కేరింతల్లో తేలిన ఇద్దరు చిన్నారులు తోటపల్లి కాలువలో పడి ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డారు. చీపురుపల్లి మండలంలోని అగ్రహారం ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఈ విషాదకర సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇజ్జిరోతు సతీష్(9) కదిరి గౌరీశంకర్ (9)అనే ఇద్దరి చిన్నారులు మృత్యువాత పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్లి మధ్యాహ్నం తమ ప్రాంతంలో జరిగిన ఒక కార్యక్రమంలో విందు చేసి తర్వాత ఆడుకుని సాయంత్రం నాలుగు గంటల సమయంలో అగ్రహారం సమీపాన ఉన్న తోటపల్లి కుడి కాలువ వైపు సైకిళ్లపై ఇద్దరు బాలురు వెళ్ళారని, నీటిలో దిగి ప్రమాదవశాత్తు మునిగిపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. కాలువ ఒడ్డున దుస్తులను గుర్తించి వీరు నీటిలో మునిగిపోయి ఉండవచ్చు అని స్థానికులు అనుమానించి మృతదేహాలను వెలికి తీశారు. ఇజ్జిరోతు సతీష్ తల్లిదండ్రులు శంకరరావు, ఆరుణ తమ కుమారుడిని కోల్పోడంతో గుండెలు అవిసేలా రోధించారు. రెండోబాలుడు కదిరి గౌరీశంకర్ తల్లిదండ్రులు సత్యనారాయణ, కనకరత్నం కాగా, వీరికి ఒక్కడే కుమారుడు గౌరీశంకర్ నీటిలో మునిగి మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.