క్రైమ్/లీగల్

అసెంబ్లీ ఫర్నిచర్ స్వాధీన ప్రక్రియ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 26: ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీ నుండి అక్రమంగా తరలించిన ఫర్నిచర్‌ను స్వాధీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారం జిల్లా కేంద్రమైన గుంటూరు నగరంలోని చుట్టుగుంట వద్దనున్న కోడెల కుమారుడు శివరామ్‌కు చెందిన గౌతమ్ హీరో షోరూమ్‌లో అసెంబ్లీ అధికారులు గత మూడు రోజుల క్రితం జరిపిన తనిఖీల్లో ఫర్నిచర్‌ను గుర్తించారు. ఈ విషయమై రాజధానిలోని తుళ్లూరు పోలీసుస్టేషన్‌లో అసెంబ్లీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం రెవెన్యూ, అసెంబ్లీ, పోలీసు అధికారుల బృందం షోరూమ్‌కు వచ్చి ఫర్నిచర్‌ను అసెంబ్లీకి తరలించారు. షోరూమ్‌లో 70 వస్తువులను గుర్తించినట్లు తుళ్లూరు డిఎస్పీ తెలిపారు. కాగా అసెంబ్లీ అధికారులు ఇచ్చిన జాబితా కంటే ఎక్కువ ఫర్నిచర్‌ను కోడెల తరలించినట్లు తెలిపారు.