క్రైమ్/లీగల్

విద్యుత్ స్తంభంపైనే ప్రాణాలు విడిచిన కాంట్రాక్ట్ కార్మికుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఆగస్టు 27: స్థానిక బైపాస్ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా విద్యుత్ లైన్‌ల మార్పిడి పనులు చేస్తూ ఓ కాంట్రాక్ట్ కార్మికుడు విద్యుదాఘాతానికి గురై మృతి మంగళవారం మృతి చెందాడు. కాకినాడకు చెందిన కాంట్రాక్ట్ వర్కర్ మోర్తా వెంకట రమణ (35) ఉదయం విద్యుత్ స్తంభం ఎక్కి లైన్‌లు మారుస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై విద్యుత్ స్తంభం పైనే ప్రాణాలు వదిలాడు. ఈ విషయం తెలుసుకున్న చిలకలపూడి పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి మృతదేహాన్ని కిందకు దింపారు. పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యుత్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతి చెందిన కార్మికుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఎంప్లారుూస్ జెఎసీ బందరు డివిజన్ కార్యదర్శి టి చంద్రపాల్, సీఐటీయు పట్టణ, మండల కార్యదర్శులు బూర సుబ్రహ్మణ్యం, సిహెచ్ జయరావు డిమాండ్ చేశారు.