క్రైమ్/లీగల్

మంత్రి, ఎంపీపై దుష్ప్రచారం చేసిన వ్యక్తి అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఆగస్టు 27: రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు, రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్‌రెడ్డిలపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న ఓ వ్యక్తిని చిత్తూరు పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. చిత్తూరు డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వైఎస్‌ఆర్ కడప జిల్లా పులివెందుల మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న రమేష్‌బాబు అనే వ్యక్తి మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి బంధువులు తనకు బాగా తెలుసని, రూ.5లక్షలు నగదు ఇచ్చిన వారికి పంచాయతీ కార్యదర్శుల పోస్టు ఇప్పిస్తానంటూ ... కడప జిల్లాకే చెందిన అహ్మద్ అనే వ్యక్తితో ఫోన్‌లో సంభాషించాడు. ఈ సంభాషణను అహ్మద్ వాట్సాప్ ద్వారా వైరల్ చేశాడు.
విషయం తెలుసుకున్న మంత్రి తమ ప్రతిష్ఠను నీరుగార్చే విధంగా వ్యవహరిస్తున్న రమేష్‌బాబుతో పాటు అహ్మద్‌పై చర్యలు తీసుకోవాలని పెద్దిరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి సిద్దారెడ్డి ద్వారా చిత్తూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో చిత్తూరు వన్‌టౌన్ పోలీసు స్టేషన్ సీఐ భాస్కర్‌రెడ్డి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో తొలుత ప్రత్యేక బృందాలు రమేష్‌బాబును అరెస్ట్ చేసి విచారించగా మంత్రితో పాటు, ఎంపీపై చేసిన దుష్ప్రచారాలు వాస్తవమేనని ఒప్పుకున్నాడు. ఇదిలా ఉండగా రమేష్‌బాబుపై ఖాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మరో మూడు కేసులు కూడా ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈసందర్భంగా డీఎస్పీ ఈశ్వరరెడ్డి మాట్లాడుతూ ఫోన్ ద్వారా సంభాషణలను చేసిన రమేష్‌బాబును అదుపులోకి తీసుకున్నామని, కేసును సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.