క్రైమ్/లీగల్

బస్సు కింద పడి ఇద్దరి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం(క్రైం), ఫిబ్రవరి 11: ఆర్టీసీ బస్సు కింద పడి ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఒకరు నేవల్ ఉద్యోగి కాగా, మరొకరు గుర్తు తెలియని మహిళగా పోలీసులు గుర్తించారు. నగరంలోని మద్దిలపాలెం ప్రాంతంలో ఉంటున్న ఎఎస్‌జి నాగేంద్రబాబు (35) నేవల్‌లో పెట్టీ ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి సుమారు 8.30గంటల సమయంలో నాగేంద్రబాబు, ఓ మహిళ (25)తో కలిసి మోటారు బైక్‌పై, ఇతనితో పాటు నేవల్‌లో పని చేస్తున్న జార్జ్ మరో బైక్‌పై కానె్వంట్ జంక్షన్ నుండి సింథియా వైపు బయలు దేరారు. ఫ్లైఓవర్ బ్రడ్జి డౌన్‌లోని నేవల్ డాక్‌యార్డు గేటు సమీపంలో గల వై జంక్షన్ వద్ద జార్జ్ బైక్‌ను నాగేంద్రబాబు బైక్ ఢీకొంది. ఈ సంఘటనలో జార్జ్ కుడి వైపు పడిపోగా, నాగేంద్రబాబు బైక్‌తో ఎడమ వైపు పడిపోయినట్టు పోలీసులు తెలిపారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న నెంబర్ 99 ఆర్టీసీ బస్సు వారిపై నుండి దూసుకుని వెళ్లడంతో నాగేంద్రబాబు, మహిళ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందుకున్న హార్బర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. నాగేంద్రబాబు జేబులోని గుర్తింపు కార్డు ద్వారా నేవల్ ఉద్యోగిగా పోలీసులు గుర్తించి, మృతదేహాలను వెంటనే మల్కాపురంలోని నేవల్‌కు చెందిన కళ్యాణి ఆసుపత్రికి తరలించారు. నాగేంద్రబాబుతో పాటు ప్రమాదంలో మృతి చెందిన మహిళ ఎవరన్నది పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుడు నాగేంద్రబాబుకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన జార్జ్ ప్రస్తుతం నేవల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సీఐ బంగారుపాప నేతృత్వంలో హార్బర్ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.