క్రైమ్/లీగల్

చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంచికచర్ల: కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం పేరకలపాడు చెరువులో ఈతకు వెళ్ళి మంగళవారం మధ్యాహ్నాం ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. గ్రామానికి చెందిన గాజలంక గణేష్ (10), శ్రీమంత్ (8), గౌతమ్( 6) ఈముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన పిల్లలు. వీరు ఆడుకునేందుకు చెరువు గట్టు వద్దకు వెళ్ళి చెరువులోకి ఈత కొట్టేందుకు దిగారు. చెరువులో గుంటలు లోతుగా ఉండటంతో ముగ్గురు చెరువులోకి దిగీ దిగడంతోనే నీటి లోపలికి జారిపోయారు. చెరువు పక్కనే సుబాబుల్ నరుకుతున్న కూలీలు చూసి పరుగుపరుగునా వచ్చినప్పటికి అప్పటికే బాలురు గల్లంతయ్యారు. స్థానికులతో కలిసి అగ్నిమాపక సిబ్బంది వీరి మృతదేహాలను చెరువు నుండి బయటకు తీశారు. నందిగామ రూరల్ సీఐ సతీష్, కంచికచర్ల ఎస్‌ఐ శ్రీహరి మృతదేహాలను శవపంచనామ అనంతరం పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ఆసుపత్రికి తరలించారు.