క్రైమ్/లీగల్

17 మంది దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాజహాన్‌పూర్ (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్‌లో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17మంది దుర్మరణం చెందారు. మృతుల్లో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. రాష్ట్రంలోని షాజహాన్‌పూర్ జిల్లాలో 24వ జాతీయ రహదారిపై జమ్కా వద్ద ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదానికి ప్రధాన కారణం ట్రక్కు డైవర్ అతివేగమే కారణమని పోలీసు వర్గాలు వెల్లడించాయి. లక్నోకు 170 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఘోర దుర్ఘటనకు సంబంధించి షాజహాన్‌పూర్ ఎస్పీ దినేష్ త్రిపాఠి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అత్యంత వేగంగా వస్తున్న ట్రక్కు మొదట టెంపోను ఢీకొని ఓవర్‌టేక్ చేస్తున్న క్రమంలో మరో వ్యాన్‌ను ఢీకొంది. దీంతో వ్యాన్ కాస్తా మురుగుకాలువలో పడిపోవడం దానిపై ట్రక్కు పడడంతో ఈ సంఘటన సంభవించింది. ఈ ఘటనలో వ్యాన్‌లో వారిలో 16మంది అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మరో మహిళ మరణించింది. క్రేన్ సహాయంతో వ్యాన్‌లో ఛిద్రమైన మృతదేహాలతో పాటు వాహనాలను వెలికితీసే ప్రయత్నాలు చేస్తున్నారు. సంఘటన జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారు కాగా.. క్లీనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. బతారా ప్రాంతం నుంచి టెంపో ప్రయాణికులను తీసుకెళ్తుండగా.. షాజహాన్‌పూర్ నుంచి వ్యాన్ ప్రయాణికులతో వెళ్తోండగా దుర్ఘటన సంభవించింది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు. ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిందా? లేక మరే ఇతర కారణాలున్నాయా? అన్న అంశాలపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించినట్లు బరేలి డివిజన్ కమిషనర్ రణ్‌వీర్ ప్రసాద్ తెలియజేశారు. ప్రమాదానికి గురైన వాహనాలకు పర్మిట్‌లు ఉన్నాయా? లేదా? అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రసాద్‌తో పాటు డీఐజీ రాజేష్ కుమార్ పాండే సంఘటనా స్థలాన్ని సందర్శించచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి సంఘటన వివరాలు తెలుసుకొన్నారు.
ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి
రోడ్డు ప్రమాద ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ఆదేశించారు. నిబంధనల మేరకు మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.