క్రైమ్/లీగల్

చిదంబరానికి మరొక రోజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 27: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరం ఈడీ అరెస్టు చేయకుండా సుప్రీం కోర్టు మరొక రోజు గడువు పొడిగించింది. ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో చిదంబరం మనీలాండరింగ్ అభియోగం ఎదుర్కొంటున్నారు. చిదంబరం దాఖలు చేసిన రెండు పిటిషన్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మంగళవారం తన వాదనలు వినిపించింది.
న్యాయమూర్తులు ఆర్ బానుమతి, ఎఎస్ బోపన్నతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం చిదంబరాన్ని బుధవారం వరకూ అరెస్టు చేయకుండా ఆదేశాలు జారీ చేసింది. మాజీ మంత్రి తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ తన వాదనలు వినిపించారు. 2018 డిసెంబర్ 19, 2019 జనవరి 1, 21 తేదీల్లో ఈడీ చిదంబరాన్ని ప్రశ్నించిందని, వాటి ప్రతులను తమకు అందించాల్సిందిగా ఈడీని ఆదేశించాలని సిబాల్ కోరారు. ఆ పత్రాలు బయటపెడితే విచారణకు చిదంబరం సహకరించిందీ లేనిదీ తేలిపోతుందని ఈడీని ఉద్దేశించి అన్నారు. తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ కోరడం సరైంది కాదని ఆయన తెలిపారు. చిదంబరం కస్టడీ కోసం కోర్టుకు అందజేసిన పత్రాలు సక్రమంగా లేవని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ చిదంబరం అరెస్టు చట్టవ్యతిరేకమని అన్నారు. రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కును కాలరాశారని ఆయన ఆరోపించారు. ఆర్టికల్ 21ను ఉల్లంఘించడమేనని సింఘ్వీ వాదించారు. చిదంబరంపై దాఖలైన మనీలాండరింగ్ కేసు నిలవదని అది 2007-2008లో నమోదు చేసిందని సింఘ్వీ చెప్పారు. 2009లో ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ చట్టం(పీఎంఎల్‌ఏ) సవరించినట్టు ఆయన కోర్టుకు తెలిపారు. ఈడీ అరెస్టు చేయకుండా సుప్రీం కోర్టు విధించిన గడువు సోమవారంతో ముగిసింది. అయితే దాన్ని మంగళవారానికి పొడిగించారు. దాన్ని మళ్లీ బుధవారం వరకూ గడువుపెంచారు. చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉండగా ఐఎన్‌ఎక్స్ మీడియాకు సహకరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. విదేశీ పెట్టుబడుల సేకరణకు సంబంధించి సంస్థలు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని 2017 మేనెలో సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. అదే ఏడాది ఈడీ కూడా మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.