క్రైమ్/లీగల్

5వేల కోట్ల క్యూ‘నెట్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి: మల్టీలెవెల్ మార్కెటింగ్ సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. విహన్ డైరెక్ట సెల్లింగ్, గోల్డ్ క్విస్ట్, క్విస్ట్ నెట్ లాంటి కొత్త పేర్లతో వచ్చే మల్టీలెవెల్ మార్కెటింగ్ సంస్థలను నమ్మవద్దని సూచించారు. ‘క్యూనెట్’ నిర్వహకులే కొత్త పేర్లతో ప్రజలను మోసం చేయాడానికి ప్రయత్నిస్తున్నారని సీపీ వివరించారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కొత్త పేర్లతో మోసం చేస్తున్న క్యూ నెట్ మల్టీలెవెల్ మార్కెటింగ్ మోసాలు వెల్లడించారు. ఇప్పటి వరకు క్యూనెట్
స్కామ్‌లో 38 కేసులు నమోదు చేసి 70 మందిని ఆర్థిక నేరాల నిరోధక విభాగం పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. బెంగళూర్‌లో 2.7 కోట్ల రూపాయలను కూడా సీజ్ చేయడం జరిగిందని సజ్జనార్ వెల్లడించారు. క్యూ నెట్‌ను ప్రమోట్ చేసిన ప్రముఖ బాలీవుడ్ నటులకు నోటీసులు ఇవ్వడం జరిగిందని చెప్పారు. దేశ వ్యాప్తంగా క్యూనెట్ సంస్థ ప్రజల నుండి కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేసిందన్నారు. సంస్థ దేశవ్యాప్తంగా 5వేల కోట్ల రూపాయలు మోసం చేసినట్లు విచారణలో వెల్లడైయిందని ఆయన తెలిపారు. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటకలో ఎక్కవ శాతం బాధితులు ఉన్నారని తెలిపారు. మినిస్టరీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్‌కు చాలా ఫిర్యాదు అందడంతో కేసు విచారణ చేయాలని రిజిస్ట్రార్ కంపెనీస్‌కు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పారు. విచారణలో క్యూ నెట్ కోట్ల రూపాయలు డబ్బులు పెట్టుబడులు పెట్టించి మోసం చేసినట్లు నివేదిక ఇచ్చినట్లు సీపీ వివరించారు. సంస్థకు చెందిన 12 మంది డైరెక్టర్లపై లూక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కోంటున్న ప్రముఖులు దేశం దాటి పోకుండా నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఎలాంటి గుర్తింపులేని ప్రొడక్టులను ఆరోగ్య ప్రదమైన వాటిగా ప్రచారం చేసుకుంటు ప్రజలకు అంటగడుతున్నారని సీపీ తెలిపారు. క్యూ నెట్‌కి ఎలాంటి రికార్డులు లేవని కేవలం డబ్బులు వసూలు చేసి మోసం చేయడంమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా సంస్థపై కేసులు నమోదు చేయడం వలన ముందు క్యూనెట్ పేరు చెప్పకుండా అమాయకులను సులువుగా డబ్బులు సంపాదించ వచ్చని చెప్పి నిరుద్యోగులను విద్యార్ధులను మోసం చేస్తున్నారని వెల్లడించారు. 15 రోజల క్రితం సైబరాబాద్ పరిధిలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీరుతో పాటు మహా రాష్ట్రలో మరో వ్యక్తి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లు సీపీ వివరించారు. మల్టీలెవెల్ మార్కెటింగ్ మోసాల పట్లు ప్రజలు అప్రమత్తంగా ఉండాని సీపీ కోరారు. ఈ కార్యక్రమంలో క్రైం డీసీపీ ప్రియదర్శిని, ఎకనామిక్ ఆఫెన్స్‌స్ వింగ్ ఏసీపీ రఘవేంద్ర రెడ్డితో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
చిత్రం...క్యూనెట్ మోసం గురించి విలేఖరులకు వివరిస్తున్న సీపీ సజ్జనార్