క్రైమ్/లీగల్

బస్సు కిందకు కూతురిని తోసిన తల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేపీహెచ్‌బీకాలనీ, ఆగస్టు 27: కన్న కూతురిని ఓ తల్లి బస్సు కిందకు తోసేయడంతో డ్రైవర్ చాక చక్యంగా వ్యవహరించి చిన్నారిని కాపాడాడు. ఈ సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో భాగ్యనగర్‌కాలనీలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఓ కసాయి తల్లి రెండేళ్ల చిన్నారిని బస్సు కిందకు తోసేయడంతో డ్రైవర్ అప్రమత్తతో ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది. గమనించిన స్థానికులు కసాయి తల్లిని చెట్టుకు కట్టేసీ దేహశుద్ది చేశారు. తన పేరు సోని అని, నా కూతురు శీరిష అని తన భర్త రెండవ పెళ్లి చేసుకుని వదిలేశారని ఆ మహిళ పేర్కోంది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకుని ఆమెను, చిన్నారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రి తరలించారు. సోని మద్యం మత్తులో ఉన్నట్లు వైద్యులు, పోలీసులు తెలిపారు.