క్రైమ్/లీగల్

ఆభరణాలు, నగదు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడ్‌మెట్, ఆగస్టు 27: చెడు వ్యసనాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలని దొంగతనాలకు పాల్పడుతు తప్పించుకు తిరుగుతున్న ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 15 లక్షల రూపాయల విలువ చేసే బంగారు, వెండి అభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్న సంఘటన రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరిగింది. మంగళవారం నేరేడ్‌మెట్‌లోని రాచకొండ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు. బోడుప్పల్ పరిధిలోని అంబేద్కర్‌నగర్‌లో నివసించే పోటేల్ రమేష్ అలియాస్ పటేల్ (32), ఇందిరానగర్‌లో నివసించే గుండురి కిరణ్(32) డ్రైవర్‌లుగా పనిచేస్తున్నారు. చెడు వ్యసనాలకు అలవాటు పడిన ఇద్దరు సులభంగా డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో 2013 నుండి దొంగతనాలు చేయడం ప్రారంభించినట్టు సీపీ తెలిపారు. కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో 15 దొంగతనాలు చేసి గత ఆరు నెలల క్రితం జైలుకి వెళ్లి వచ్చిన్నట్టు తెలిపారు. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద కారులో అనుమానస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని ఎల్‌బీనగర్ సీసీఎస్, మేడిపల్లి క్రైమ్ పోలీసులు పట్టుకుని విచారించగా అసలు విషయం చెప్పారు. ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 28 తులాల బంగారం, 37 తులాల వెండి అభరణాలు, మారుతు కారు, 5 సెల్‌ఫోన్‌లు, కత్తి, కట్టింగ్ ప్లేయర్ రూ.7 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్టు సీపీ తెలిపారు.
మరో సంఘటనలో..
నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో గొలుసు దొంగిలించిన వ్యక్తిని అరెస్టు చేసిన సంఘటన ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీపీ తెలిపిన వివరాల ప్రకారం జిల్లెలగూడలో నివసించే కుషారియ దత్తరామ్(26) ప్రైవేటు ఉద్యోగి. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నట్టు సీపీ తెలిపారు. సాగర్ రింగ్ రోడ్డు వద్ద నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో గొలుసును దొంగిలించినట్టు సీపీ తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం నిందితున్ని అరెస్టు చేసి రూ.35 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు సీపీ తెలిపారు.